Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక చికిత్స కేంద్రం సందర్శన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక చికిత్స కేంద్రాన్ని సందర్శించారు. ఈ విభాగంలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు మరియు ఇతర వివరాలను గురించి సదరు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మానసిక రుగ్మతల నుండి పూర్తిగా ఉపశమనం పొందిన వారిని తిరిగి వారి కుటుంబ సభ్యులతో కలిపేందుకు తగు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి న్యాయ సహాయం అవసరమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సహకారం అందిస్తామన్నారు. మానసిక చికిత్స విభాగంలో చికిత్స పొందుతున్న వారితో న్యాయమూర్తి ప్రత్యూష కుమారి మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఆసుపత్రి అందిస్తున్న సదుపాయాలు, వైద్యులు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సలహాలు పాటిస్తూ తగు జాగ్రత్తలు పాటిస్తే త్వరగా కోలుకోవచ్చని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *