-నియోజకవర్గంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత…
-అట్టహాసంగా క్లీన్ రాజానగరం కార్యక్రమానికి శ్రీకారం…
-పారిశుద్ధ్య కార్మికులతో కలిసి డ్రైన్లలో సీల్టు మరియు గ్రామ వీధులను శుభ్రం చేద్దాం
-ఎమ్మెల్యే జక్కంపూడి రాజా…
-అందరిని భాగస్వామ్యం చేసే విధంగా కార్యక్రమం రూప కల్పన..
-స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నేటి నుండి 13వ తారీకు వరకు…
-గ్రామస్తులు మరియు కార్మికులు అధికారులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా…
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజానగరం నియోజకవర్గంలో గ్రామాలను స్వచ్ఛమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో క్లీన్ రాజానగరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. సోమవారం రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో గ్రామస్తులు అధికారులు అందరి సమన్వయంతో క్లీన్ రాజానగరం కార్యక్రమానికి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శ్రీకారం చుట్టి పారిశ్చర్ కార్మికులతో కలిసి డ్రైనేజీలో సిల్టు మరియు వీధులను ఆయన శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ గ్రామాలలో కాలువల శుభ్రంగా లేకపోతే దోమలు,దుర్గంధం పెరిగి అంటు వ్యాధులు ప్రభలే ప్రభావం ఉండడంతో ప్రతి గ్రామంలోనూ క్లీన్ రాజానగరం కార్యక్రమం చేపట్టి గ్రామాలలో పరిశుభ్రంగా ఉంచడానికి అటు గ్రామస్తులను, అధికారులను,సచివాలయ సిబ్బందిని,భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. క్లీన్ రాజానగరం కార్యక్రమం నేటి నుండి ఈ నెల13వ తారీకు వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టమని గ్రామాలలో గ్రామ నాయకుల చొరవతో చేపట్టే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఇంటికి వచ్చే అతిథుల కోసం మన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. అందులో భాగంగానే డ్రైన్లలలో సిల్టు తొలగించి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తున్నామని అదే విధంగా గ్రామాలలో ఎక్కడైనా చెత్తా చెదారాలు ఉంటే వాటిని తొలగిస్తున్నామని,గ్రామస్థాయిలో వీధులను శుభ్రంగా ఉంచుతున్నామన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అనే సంకల్పతో చేపట్టిన ఈ కార్యక్రమం భవిష్యత్తులో నిరంతరాయంగా కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ జానా సత్యనారాయణ, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ఈవో పి.ఆర్.డి కె. శ్రీనివాస్, స్థానిక నాయకులు గంగిశెట్టి సోమేశ్వర రావు, మందారపు వీర్రాజు, వేమగిరి కృష్ణ, దివాన్ చెరువు గ్రామ నాయకులు, పాలచర్ల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News