Breaking News

సంక్షేమ పాలనకు పట్టం కడదాం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అధికారంలో కి వచ్చిన తరువాత జనరంజకంగా సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అందరం మద్దతుగా నిలిచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి పట్టం కడుదాం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని A -కన్వెన్షన్ గ్రౌండు నందు 7,8,19 డివిజన్ లకు సంబంధించి జరిగిన వైయస్సార్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని పెరిగిన పెన్షన్ల నగదును ఆయా డివిజన్ల పరిధిలోని 2817 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వలంటీర్ ల ద్వారా నేరుగా ఇంటి వద్దకే 3000 రూపాయల పెన్షన్ అందిస్తున్న జగన్ గారికి మా ఆశీస్సులు ఎప్పుడు వుంటాయని అవ్వాతాత లు తమ ఆశీర్వచనాలు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం లో 200 రూ ఉన్న పెన్షన్ ను 1000 రూపాయల కు పెంచిన ఘనత సంక్షేమ పాలనకు అధ్యులు స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి గారిదే అని తెలిపారు. గత ప్రభుత్వం లో 2000 రూ పెన్షన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు కోసం చివరి నెలలో మాత్రమే పెంచారని విమర్శించారు. అప్పుడు జన్మభూమి కమిటీలు సూచించిన ఒకరిద్దరికి మాత్రమే పెన్షన్లు ఇచ్చి నిజంగా అర్హత ఉన్నవారికి మొండిచేయి చూపించారని కానీ నేడు పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అని అన్నారు.గతంలో మునుపెన్నడూ లేనివిధంగా తూర్పు నియోజకవర్గ పరిధిలో అర్హతే ప్రామాణికంగా 22 వేల మందికి దాదాపు 6 కోట్ల 60 లక్షల రూపాయలు అందిస్తున్న ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి కి నియోజకవర్గ ప్రజలందరి తరపున అవినాష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ,7వ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురి ,8వ డివిజన్ ఇంచార్జ్ యలమంచిలి జయ ప్రకాష్ ,19వ డివిజన్ కార్పొరేటర్ రహేన నాహీద్ ,కో అప్షన్ సభ్యులు సయ్యద్ అలీం ,డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు మెహబూబ్ ,మండల అధ్యక్షులు బుర్రి జగజ్జివన్ రామ్ ,ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ చింతగుంట విజయ్ మరియు క్లస్టర్ ఇంచార్జిలు,గృహ సారధులు,కన్వీనర్లు,డివిజన్ ప్రెసిడెంట్లు,ఆయా డివిజన్ల వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *