Breaking News

అర్జీలు రీ ఓపెన్ అయితే విభాగాదిపతే నేరుగా పరిశీలించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో ప్రజల నుండి అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలని, అర్జీలు రీ ఓపెన్ అయితే విభాగాదిపతే నేరుగా పరిశీలించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్పందన నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత గత వారం స్పందనలో అందిన ఆర్జీల పరిష్కారంపై సమీక్షించి, కొన్ని విభాగాల అధికారులు ఫిర్యాదు పరిష్కారం కాకుండానే క్లోజ్ చేస్తున్నారని, ప్రజలు తిరిగి మరలా ఫిర్యాదు రీ ఓపెన్ చేస్తున్నారని, సదరు ఆర్జీలను విభాగాదిపతే నేరుగా పరిశీలించి పరిష్కరించాలని, సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలకు సిఫార్స్ చేయాలని ఆదేశించారు.
అనంతరం కమిషనర్ స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి జగనన్నకు చెబుదాం, స్పందనకు అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులకు ఇచ్చే ఎండార్స్మెంట్ ను ఆయా విభాగాధిపతులు పరిశీలించాలని, విభాగాల వారిగా జగనన్నకు చెబుదాం అర్జీల పరిష్కారంకై ప్రత్యేక సిబ్బందిని కేటాయించుకోవాలని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు. సమస్య పరిష్కారంకు ముందు, తర్వాత ఫోటోలు జత చేయాలన్నారు. సచివాలయ కార్యదర్శులు విభాగాల వారిగా తమ సచివాలయం పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండాలన్నారు. స్పందన ఆర్జీల అప్ డేట్స్ ని ప్రత్యేకంగా విభాగాధిపతులతో ఏర్పాటు చేసిన గ్రూప్ లో పోస్ట్ చేసి, పరిష్కారాల పై సమీక్షా చేయాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జరిగే స్పందనలో కార్యదర్శులు అందరూ వార్డ్ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు.
సోమవారం నిర్వహించిన స్పందనలో 41 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 12, ఇంజినీరింగ్ విభాగం 10, రెవెన్యూ విభాగం 7, ప్రజారోగ్య విభాగం 6, ఉపా సెల్ విభాగం 4, అకౌంట్స్ విభాగం 2 ఫిర్యాదులు అందాయని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె.లక్ష్మీ శివజ్యోతి, ఎస్ఈ (ఎఫ్ఎసి) సుందర్రామిరెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఉపా సెల్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, డి.సి.పి.లు, ఏసిపిలు, ఈఈలు, యస్.యస్ లు,ఆర్ఓ లు, సూపరిండెంట్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *