Breaking News

క్రీడల్లో ముందంజలో ఉండాలి

-ఆడుదాం ఆంధ్ర క్రీడాకారులకు ప్రొఫెషనల్ కిట్స్ పంపిణీ
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి యువతరం చదువులోనే కాదు క్రీడల్లో కూడా ముందంజలో ఉండాలని ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలో 144 సచివాలయం గెలిచిన క్రీడాకారులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఆడుదాం ఆంధ్ర మొదటి దశ సచివాలయం పరిధిలో పూర్తయినందున, రెండో దశ మండలం స్థాయిలో క్రీడలు నిర్వహించనున్న నేపథ్యంలో విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మంగళవారం ఉదయం 144 సచివాలయం పరిధిలో గెలిచిన క్రీడాకారులకు, మండలం స్థాయిలో పాల్గొనేందుకు ప్రొఫెషనల్ కిట్స్, టీ షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి యువతరం చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా ముందంజలో ఉండాలని, నేటి యువతరంలో దాగున్న టాలెంట్ వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నేటి సచివాలయం స్థాయి లేదా మండలం స్థాయి క్రీడాకారులు రేపటి జాతీయ స్థాయిలో కూడా పాల్గొనే సత్తా వాళ్ళలో ఉంటుందనే భావించి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర కేవలం ఆట మాత్రమే కాదు క్రీడల పట్ల ఆసక్తి ఉన్న క్రీడాకారులకు కనీస వసతులు నోచుకోలేని స్థితిలో ఉన్న వారికైనా మౌలిక సదుపాయాలు టీ షర్ట్లు, కిట్లు పంపిణీ చేస్తూ వాళ్లలో ఉన్న క్రీడాశక్తిని పెంచి క్రీడల్లో భాగస్వాములు చేసి క్రీడలో వాళ్లని ముందుంజులో ఉంచాలన్నది ముఖ్య ఉద్దేశం అని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *