Breaking News

కొత్త వంతెన స‌మీపంలో యూకో బ్యాంకు మెయిన్ బ్రాంచ్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భార‌త‌దేశంలో అభివృద్ధి చెందుతున్న ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ఒక‌టైన యుకో బ్యాంక్ విజ‌య‌వాడ‌లోని ఏలూరు రోడ్డులోని ఆంజ‌నేయ‌స్వామి దేవ‌స్థానం స‌మీపంలో శ్రీర‌మ‌ణ నిల‌యంలో బుధ‌వారం ఏర్పాటు చేశారు. ఈ విశాల‌మైన ప్రాంగ‌ణంలో ఖాతాదారులు, వినియోగ‌దారుల‌కు సుల‌భంగా ఉంటుంద‌ని, ఈ ప్ర‌ధాన శాఖ‌లో క‌స్ట‌మ‌ర్ సేవా విభాగం మ‌రియు స‌రికొత్త సౌక‌ర్యాల‌ను అందుబాటులోకి తెచ్చామ‌ని బ్యాంకు ప్రారంభం సంద‌ర్భంగా యుకో బ్యాంక్ హైద‌రాబాద్ జోన‌ల్ హెడ్, డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ఎన్‌.శ్రీకాంత్ తెలిపారు. లెనిన్ సెంట‌ర్ నుండి త‌మ బ్రాంచ్ క‌స్ట‌మ‌ర్ల సౌల‌భ్యం కోసం ఈ విశాల ప్రాంగ‌ణంలోకి త‌ర‌లించ‌డం ప‌ట్లం హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కార్య‌క్ర‌మానికి గౌర‌వ అతిథిగా విచ్చేసిన యుకో బ్యాంక్ హైద‌రాబాద్ జోన్ డిప్యూటీ జోన‌ల్ హెడ్ మోతీలాల్ మాట్లాడుతూ, క‌స్ట‌మ‌ర్ల బ్యాంకింగ్ అవ‌స‌రాల‌క‌నుగుణంగా పూర్తిగా అప్‌గ్రేడ్ చేసిన‌ట్లు చెప్పారు. గుంటూరు మెయిన్ బ్రాంచ్ అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ సురేష్ ప‌రిమి, ఏపిఎస్‌సిఎస్ఎల్ మేనేజ‌ర్ నాగ‌సుధ‌, రిటైల్ లోన్ హ‌బ్ చీఫ్ మేనేజ‌ర్ మేథావి అతిథులుగా హాజ‌ర‌య్యారు. అనేక‌మంది వినియోగ‌దారులు, విశ్రాంత అధికారులు, అన్ని స్థానిక న‌గ‌ర శాఖ‌ల సిబ్బంది కొత్త ప్రాంగ‌ణంలో జ‌రిగిన ప్రారంభోత్స‌వంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *