Breaking News

ఉచిత న్యాయ సేవల గురించి అందరికీ తెలియజేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్  కె. ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించిన పారా లీగల్ వాలంటీర్లతో మాట్లాడారు. ఖైదీలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల గురించి అందరికీ తెలియజేయాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు సంస్థ దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. కారాగారంలోని వసతులను, సదుపాయాలను పరిశీలించిన అనంతరం ఖైదీలతో మాట్లాడారు. ఉచిత న్యాయ సేవలు పొందడం ఖైదీల హక్కు అని, ఖైదీల తరపున వాదించేందుకు న్యాయవాది లేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని, ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలని అన్నారు. వారికి ఎలాంటి న్యాయ సమస్యలున్నా పారా లీగల్ వాలంటీర్ల ద్వారా కానీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా కానీ సంస్థకు తెలియజేయాలని అన్నారు. అనాలోచితంగా చేసే పనుల వల్ల అనేక ఇబ్బందులు కలుగుతాయని, ఏ పని అయిన చేసే ముందు మంచి చెడులు ఆలోచించుకోవాలని, చెడు సహవాసాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. ఖైదీలందరూ పరివర్తన చెంది న్యాయబద్ధమైన జీవనశైలిని అలవరుచుకోవాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *