Breaking News

వేమూరు నియోజకవర్గం జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

వేమూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వేమూరు నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. గుంటూరు జిల్లా తెనాలిలో గురువారం ఉదయం ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. అధ్యక్షునిగా మేకల సుబ్బారావు(ఆంధ్ర ప్రభ), ప్రధాన కార్యదర్శి గా పులివర్తి బుల్లయ్య (సాక్షి), ఉపాధ్యక్షునిగా కరేటి సాంబశివరావు ( ప్రజా ప్రవాహం), సహాయ కార్యదర్శులు గా దాసరి వెంకటేశ్వరరావు (ఉదయం), యల్లమాటి రామకృష్ణ బాపనయ్య (టి వి 11) లను ఏకగ్రీవంగా గా ఎన్నికయ్యారు. నూతన కమిటీని ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఎ. ఆంజనేయులు, నాయకులు పున్నయ్య, జహీర్, సురేష్ బాబు, వేజండ్ల రాజారావు, డి. కోటేశ్వరరావు, ఎ. సాంబ శివరావు, ప్రకాశరావు, చందు, శ్రీకాంత్, ప్రసాద్, ఎస్.ఎస్. వి శేఖర్, వి. లక్ష్మణ్ , నాయుడు, ప్రవీణ్ తదితరులు అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *