Breaking News

2 వ రోజు శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరుగుతున్న హెల్తీ విలేజ్ జాతీయ వర్క్ షాప్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ మాట్లాడుతూ.., కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రాధాన్యత నిచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థ హెల్తీ విలేజ్ , సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధన కార్యశాల నిర్వహించడం సంతోషంగా ఉందని ధన్యవాదాలు అన్నారు. గ్రామాలలో మహిళ పొదుపు సంఘాల పాత్ర చూస్తే రోజుకు రూపాయి పొదుపు తో ప్రారంభమై 10,000 రుణం పొందే స్థాయి నుండి నేడు 20 లక్షలకు రుణం పొందే అవకాశం లభించడం తద్వారా మహిళలు అనేక చిరు వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా ఎదిగారని ఎన్నో నిదర్శనాలు మన కళ్ళ ముందు ఉన్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సచివాలయ వ్యవస్థతో హెల్త్ విలేజ్ కోసం ఏర్పాటుచేసిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ వంటివి పౌరుల ఆరోగ్య రక్షణకు భరోసా ఇస్తున్నదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసే విధంగా గ్రామాలలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యశాల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శ్రీమతి సూర్యకుమారి అనునిత్యం వెంట ఉండి సభను విజయవంతం చేసిందని కొనియాడారు.

కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మాజీ కార్యదర్శి సునీల్ కుమార్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రభుత్వాలు ప్రధాన పాత్ర పోషించే విధంగా అవకాశం ఇస్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అభివృద్ధిలో ముందు ఉంటాయని అన్నారు.

సాయంత్రం వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజా ప్రతినిధులు స్థానిక సంస్థల ప్రతినిధులు సిబ్బంది గ్రూప్ ఫోటోలు దిగారు.

ఈ కార్యశాలలో పాల్గొన్న
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీ వివేక్ భరద్వాజ్,
అడిషనల్ సెక్రెటరీ సి ఎస్ కుమార్ , పంచాయతీరాజ్ కమిషనర్ సూర్యకుమారి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి రాజశేఖర్ రెడ్డి, ఉన్నతాధికారులు , వివిధ రాష్ట్రాల నుండి కార్యాశాలకు హాజరైన వారు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *