-నగర కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తుది జాబితా సోమవారం విడుదలైన సందర్భంలో, ఓటర్లు తమ పేరు తుది జాబితాలో లేకపోతే వెంటనే తమ పేరును నమోదు చేసుకోవాలని సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఉదయం నిర్వహించిన పొలిటికల్ పార్టీ సమీక్ష సమావేశంలో అన్నారు.
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద గల తమ ఛాంబర్ లో పొలిటికల్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తుది జాబితా సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్లో అందుబాటులో ఉందని, ఓటర్లు తమ ప్రాంతంలోని బిఎల్ఓల ద్వారా కూడా అడిగి తెలుసుకోవచ్చు అని తెలిపారు. ఒకవేళ ఓటర్ల పేరు తుది జాబితాలో లేనట్లయితే వెంటనే ఫామ్ 6 ను నింపి బిఎల్ఓ లకు సమర్పించవలసిందిగా కోరారు.
సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 273754 ఓట్లు ఉన్నాయని అందులో మహిళల ఓట్లు 140656 కాగా మగవారి ఓట్లు 133048 ఉండగా ఇతర ఓట్లు 50 ఉన్నట్లు తెలిపారు.
గత సమావేశంలో 1400 కంటే ఎక్కువగా ఉన్న ఓటర్లకు ఉండే పోలింగ్ బూత్ లో ఒక ఆక్సిలరీ బూతు ను ఏర్పాటు చేసేందుకు వసతులు ఉన్నాయో లేవో తెలుసుకొని రమ్మని బిఎల్ఓ లకు చెప్పగా, ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉన్నాయని నివేదిక ఇచ్చారు. అలా మరో ఐదు పోలింగ్ కేంద్రాలు ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలుగా అదే పోలింగ్ బూత్ లో రాబోతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు వై.సుందర్ పాల్ (YSRCP), వెంకట్ (BJP), యస్ ఎ అన్సారి (కాంగ్రెస్) , యన్ వీర భద్ర రావు (CPI), యం వినోద్ కుమార్ (బహుజన్ సమాజ్ పార్టీ), చీఫ్ సిటీ ప్లానర్ జీవి జీ ఎస్ వి ప్రసాద్, జెడ్ సి-2 మల్యాద్రి, డిప్యూటీ తహసిల్దార్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News