విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కరీముల్లా షెరీఫ్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి మంగళవారం భవానిపురం, విజయవాడ లోని శ్రీ ఆంజనేయ రెస్టారంట్ మరియు మండీస్ రెస్టారెంట్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, సదరు హోటల్ నందు అనుసరిస్తున్న ఆహార భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అధికారులు రిఫ్రిజిరేటర్‌లో ఆహార తయారీ ప్రదేశం పరిశుభ్రత లేకపోవుట, ఆహరం ఉంచిన పాత్రలపై మూతలు లేకపోవుట, ఒకసారి ఉపయోగించిన పోలార్ కాంపోనెంట్ నిర్దేశిత విలువ 25% కంటే ఎక్కువ కలిగిన వంట నునెని తిరిగి ఉపయోగించుట వంటి ఉల్లంఘనలను గుర్తించారు. అధికారులు నిల్వ ఉంచిన ఆహర పదార్ధాలు నుంచి నమూనాలు సేకరించి స్టేట్ ఫుడ్ ల్యాబ్, హైదరాబాద్‌కు విశ్లేషణ నిమితం పంపడం జరిగినది. పైన తెలిపిన ఉల్లంఘనలకు గాను హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారి చేసి, పిదప తగు చర్యలు తీసుకోనుటకు పరిపాలన అధికారి మరియు జాయింట్ కలెక్టర్ వారికీ ఫిర్యాదు చేయటం జరిగింది. హోటల్ నిర్వాహకులు అందరు కూడా FSSAI ప్రామాణికం కలిగిన పదార్ధాలు వినియోగించి పరిశుభ్రమైన ప్రదేశం లో ఆహారం తాయారు చేసి నాణ్యమైన ఆహరం వినియోగదారులకు అందచేయాలని రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కరీముల్లా షెరీఫ్ సూచించారు, లేని పక్షములో నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాము అని హేచరించారు.
Prajavartha Online Telugu News