Breaking News

విజయవాడ అందాలకు మరో మణిహారం

-అభివృద్ధి దిశలో కండ్రిక ఇన్నర్ రింగ్ రోడ్ జంక్షన్
-నగర కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అందాలతో విరజమవుతున్న శుభవేళ మరింత అందాన్ని పెంచే ప్రాజెక్టుకు శ్రీకారం చేయబోతున్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్. కండ్రిక ఇన్నర్ రింగ్ రోడ్ జంక్షన్ అభివృద్ధి పనులకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కండ్రిక ఇన్నర్ రోడ్ జంక్షన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కండ్రిక ఇన్నర్ రింగ్ రోడ్ జంక్షన్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడానికి రోడ్లు మరియు భవనాల శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్తంగా చర్యలు చేపట్టాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బందిని అక్కడున్న భౌగోళిక స్థితిగతులను బట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేయమన్నారు. త్వరితగతిన ఆ ప్రణాళికను పూర్తి చేసి ఒక నివేదికను సమర్పించి జంక్షన్ అభివృద్ధిని వెంటనే మొదలుపెట్టాలి అన్నారు.

ఈ పర్యటనలో కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో పాటు నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, ఎసిపి మోహన్ బాబు, రోడ్లు మరియు భవనాల శాఖ డిఈ శశి భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *