Breaking News

విద్యార్థులతో కిటకిటలాడిన ‘సౌత్ జోన్ సైన్స్ ఫెయిర్’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో విజయవాడ సమీపాన మురళి రిసార్ట్ ‘సౌత్ జోన్ సైన్స్ ఫెయిర్’ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సైన్స్ ఫెయిర్ లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు రూపొందించిన 210 ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులను కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు తదితర జిల్లాల నుంచి దాదాపు 5000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు వీక్షించినట్లు సైన్స్ ఫెయిర్ కో ఆర్డినేటర్ డా. జి.ఆర్.భాగ్యశ్రీ పేర్కొన్నారు. సైన్స్ ఫెయిర్ నేటితో (ఫిబ్రవరి 1) ముగుస్తుందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *