Breaking News

ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ పి రాజాబాబు బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నెలవారి తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆవరణలో గల ఈవీఎం గోడౌన్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించి ఈవీఎం గోడౌన్ సీళ్లు తనిఖీ చేశారు, సీసీ కెమెరాలు పనిచేస్తున్నది లేనిది ఆరా తీశారు. సెక్యూరిటీ పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ల్యాండ్ స్కేప్ డెవలప్మెంట్ లో భాగంగా మెరక పనులు పరిశీలించారు. సందర్శకులకు అవసరమైన టాయిలెట్స్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారి మెండు సురేష్, సిబ్బంది శ్యామ్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *