Breaking News

రాజకీయాల కోసం ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రంగా దేశంలో నిలిపారు… : నేతి మహేశ్వరరావు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఆర్థికస్థితి ని దృష్టిలో పెట్టుకొని పార్టీలు రాబోయే ఎన్నికలలో హామీలు ఇస్తున్నారా? లేదా గెలవడం కోసం హామీలు ఇచ్చి గెలిచాక ప్రజలను మోసం చేయబోతున్నారా? అని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షులు నేతి మహేశ్వరరావు ప్రశ్నించారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ… పాలకులు గెలుపు రాజకీయాల కోసం అన్నట్టు ఆర్థిక విధానాలను రూపొందించి ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రంగా దేశంలో నిలిపారని మండిపడ్డారు. తీసుకొస్తున్న అప్పులు సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతూ అభివృద్ధిని గాలికి వదిలేసారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలతో ఆర్థిక లోటును భర్తీ చేయాల్సిన ప్రభుత్వాలు తీవ్ర ఆర్థిక లోటు పైపు రాష్ట్రాన్ని తీసుకొని పోతున్నాయి. విభజన మన ఆంధ్ర జాతిని అగాధంలోకి నెట్టిందని, హైదరాబాద్ కోసం తెచ్చిన లక్షల కోట్ల అప్పులు పంచారు. ఆదాయం వచ్చే హైదరాబాద్ ని తెలంగాణకి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాబడి నుంచి జీతాలు మిగతా ఖర్చులు అలాగే వడ్డీ అప్పులు తాలూకు చెల్లింపులను తీసివేస్తే సంక్షేమం కూడా చేయలేని పరిస్థితి ఉందని అన్నారు. ఆరోగ్యశ్రీ లేకుండా చేశాడు. రాష్ట్రంలో పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీనికి జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన సమాధానం చెప్తాడని, రాజశేఖర్ రెడ్డి వారసుడుని అని చెప్పుకోవడం కాదు నీ తండ్రి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని ఏం చేసావని, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్ల అడగడానికి వస్తాను అన్నావు? దాని పరిష్కరించాకే ఓట్లను అడుగు, నీ తండ్రి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకువచ్చారు. దానిని నువ్వు తూట్లు పొడిచావు. ఆర్థిక అంశాల పైన మాతో చర్చికు వచ్చే దమ్ము ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని, మీ బిడ్డ మీకు ఇస్తున్నాడు అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ మీ నెత్తి మీద ఎంత అప్పు పెట్టాడో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, అమరావతి ప్రాజెక్ట్ లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వసుంధరాదేవి, జొన్నల గడ్డ శ్రీనివాసరావు, బొప్పన రాజశేఖరరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *