Breaking News

విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు భరోసా కల్పించాం…

-రైతు పాలిట దేవాలయాలు రైతు భరోసా కేంద్రాలు
-దుళ్ళ గ్రామంలో రు.25 లక్షలతో సచివాలయం-1 అదనపు భవనం
-రు. 21. 80 లక్షల టో రైతు భరోసా కేంద్రం
-రు.16 లక్షల తో సీసీ డ్రైన్ లను ప్రారంభించుకున్నాం.
-రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల 8 మాసాల్లో రు. 35 వేల కోట్ల రైతు ఖాతాలకు జమ చేయడం జరిగింది.
-గ్రామ స్వరాజ్యం, గ్రామ అభ్యుదయానికి సాక్ష్యం.. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన
-మంత్రి వేణుగోపాలకృష్ణ

కడియం మండలం,దుళ్ల) నేటి పత్రిక ప్రజావార్త :
విత్తనం నుంచి విక్రయం వరకు అన్నదాతలకు జగనన్న ప్రభుత్వం నేనున్నానంటూ ఆర్థిక భరోసా కల్పిస్తూ అన్ని విధాల ఆడుకుంటోందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్  చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం కడియం మండలం దుళ్ల గ్రామంలో మంత్రి వేణు గోపాలకృష్ణ అధికారులు స్థానిక నాయకులతో కలిసి సచివాలయం అదనపు భవనాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని, సీసీ డ్రైన్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు భరోసా కేంద్రాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసి వారికి ఆర్థిక భరోసాను కల్పించారని పేర్కొన్నారు. ప్రజల ముంగిటికే పాలన వ్యవస్థను తీసుకొచ్చి ప్రజా సమస్యలు వారి గ్రామాల్లోనే పరిష్కరించే విధంగా వాలంటరీ, సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఇందులో భాగంగా నేడు రు. 25 లక్షల రూపాయలతో సచివాలయం-1 అదనపు భవనాన్ని, రు. 21. 80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, రు.16 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైన్ ను ప్రారంభించుకున్నా మన్నారు. గ్రామ స్వరాజ్యం గ్రామ అభ్యుదయానికి సాక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 70 శాతం మంది పైగా ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాలను ఆధారితంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల కొరకు ఉచిత విద్యుత్ ను నాటు దివంగత మహానేత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రవేశపెట్టడం జరిగిందని పేర్కొన్నారు.

గత పాలకులు రైతులకు బేషరతుగా రు.87 వేల 650 కోట్లు రుణమాఫీ చేస్తానని రైతులకు హామీ ఇచ్చి రు. 25 వేల నుంచి రూ.15 వేలకు తగ్గించి మాత్రమే రుణ మాఫీ చేశారన్నారు. రుణ మాఫీ చేయకపోగా పండిన పంట కు గిట్టుబాటు ధర ను కూడా ఇవ్వకుండా మోసం చేశారన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం మేరకు నాలుగు సంవత్సరాలు 8 మాసాల కాలంలో రైతు భరోసా కేంద్రాల నిర్మించడమే కాకుండా పంట వేసే సమయంలో రైతు అప్పులు పాలు కాకుండా రైతు భరోసా ద్వారా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.

రైతుల పాలిట దేవాలయాలుగా రైతు భరోసా కేంద్రాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. రైతు సంక్షేమ లక్ష్యంగా రైతుల కొరకు రు. 35 వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని పేర్కొన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు కల్తీ లేని ఎరువులు పురుగు మందులు విత్తనాలు రైతులకు అందించే క్రమంలో వారికి అందుబాటులో గ్రామాల్లోనే ఆర్బికేలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
రైతుల వద్దకు సేవలు అందించే క్రమంలో ఆర్బికేల్లో నైపుణ్యత కలిగిన వారిని నియమించి రైతులకు అన్ని విధాల అండగా వుంటూ, అధిక దిగుబడి వచ్చే విధంగా సేద్యం పట్ల రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గొప్ప సంస్కర్తగా సీఎం జగన్మోహన్ రెడ్డి సంస్కరణల ద్వారా రైతుకు దగ్గరగా వ్యవసాయ మెలుకులు అందించేందుకు ఆర్.బి.కెలను ఏర్పాటు చేశారని తెలిపారు. పాలన సంస్కరణలో భాగంగా అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం వాలంటరీ సచివాలయ వ్యవస్థను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

స్వచ్ఛత మనందరి బాధ్యత :-
గ్రామాల ఆరోగ్య పరిరక్షణ మొదటి వైద్యులు పారిశుద్ధ్య కార్మికులని, గ్రామాలను పరిశుభ్రతగా మన అందరి బాధ్యతని మంత్రి వేణు గోపాల్ అన్నారు. ఇందులో భాగంగానే దుల్ల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం నిధులతో ఎస్సీ కాలనీలోని గొలుసు పుష్పావతి ఇంటి నుండి కళ్లెం కాంతారావు ఇంటి వరకు రు.  16 లక్షల రూపాయలతో నిర్మించుకున్న సిసి డ్రైన్ నేడు ప్రారంభించు కుంటున్నామని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ గ్రామంలో వున్న స్వాతంత్ర సమరయోధులు గొలుసు సాంబమూర్తి విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాలలు వేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎంపీడీవో కే రత్నకుమారి, ఏఈ సిహెచ్ త్రిమూర్తులు, జేగురుపాడు సర్పంచ్ యాదాల సతీష్ చంద్ర స్టాలిన్, వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు గిరిజాల బాబు, జుల్ల సర్పంచ్ కొండపల్లి పట్టియ్య, ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్, ఎంపీటీసీ కొట్టంగ నాగరాజు,
స్థానిక నాయకులు టీ బాబ్జి, తడాల చక్రవర్తి, అయినమిల్లి రుక్మిణి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *