-స్పందన – జేకేసీలో వచ్చిన అర్జీలను అధికారులు వేగవంతంగా పరిష్కరించాలి.
-కలెక్టరు డా. కే.మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన- జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు రీఓపెన్ కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు వారి కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు డా. మాధవీలత, జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ , డిఆర్వో, జి. నరశింహులు జిల్లా అధికారుల తో కలసి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారుల సమస్యలు పరిష్కార వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఈరోజు స్పందనలో స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి 174 అర్జీలను స్వీకరించామని ఇందులో ఆన్ లైన్ లో 151, ఆఫ్ లైన్ ద్వారా 23 ఉన్నాయని పేర్కొన్నారు. స్పందనలో వచ్చే అర్జీలను నిర్ణీత కాల వ్యవదిలో గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వస్తున్న అర్జీలు ప్రతి అర్జీని పూర్తి క్షుణ్ణంగా పరిశీలించి ఓ ఒక్క అర్జీ పునరావృతం కాకుండా పరిష్కరించాలన్నారు.
స్పందనలో వచ్చిన కొన్ని అర్జీలు.
రాజమండ్రి అర్బన్ కి చెందిన చుక్క గన్నమ్మ తమ అర్జీలో తన స్థలెలో బిల్డింగ్ కట్టుకుంటున్నాని, అయితే తన సరిహద్దు ఆసామి పిల్లి చెంచయ్య అన్న వ్యక్తి మా బిల్డింగ్ పక్కనే కట్టుకోవడంతో కనీసం 6 అంగుళాలు కూడా గ్యాప్ లేదని మా స్థలాన్ని పరిశీలించాలని కోరారు. మండపేట కు చెందిన ఎన్.పు రుషోత్తమరావు, నా కుమార్తె శ్వేత హాసిని పేరు మీద జి ఎర్రం పాలెం గ్రామంలో వ్యవసాయ భూమి ఉందని, నెక్కంటి విశ్వేశ్వ రరావు, శ్వేత హాసిని పేరు మీద కూడా ఒకటే ఎల్ పి నెంబర్ జారీ అయ్యిందని, కావున సరియాల్సిందిగా కోరుతూ వారు అర్జీలో పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, డిఆర్వో జి. నరశింహులు, జిల్లా స్థాయిఅధికారులు తదితరలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News