Breaking News

పాల సేకరణలో మంచి పురోగతి సాధించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జగనన్న పాలవెల్లువ రెండో దశ కింద చేపట్టిన 8 మండలాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని పాల సేకరణలో మంచి పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ స్పందన సమావేశం మందిరంలో జగనన్న  పాలవెల్లువపై సంబంధిత అధికారులతో  సమావేశం నిర్వహించి పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న పాల వెల్లువ  రెండవ దశలో 8 మండలాల్లో ఏర్పాటుచేసిన 69  అమూల్ పాల కేంద్రాల్లో పాల సేకరణ సరైన పురోగతి లేదన్నారు.

సమావేశానికి హాజరైన ఎంపీడీవోలు, ఏపిఎంలు, మెంటార్లు, సహకార సంఘాల ప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఒక్కో పాల కేంద్రాన్ని బాధ్యత తీసుకొని అక్కడి రైతులతో సమావేశం నిర్వహించి పాలు పోసే విధంగా ప్రోత్సహించాలన్నారు. అమూల్ పాల కేంద్రాలకు పాలు పోస్తే మంచి ధర  లభించడంతోపాటు దాని వలన భవిష్యత్తులో కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలను రైతులకు విశదంగా వివరించాలన్నారు. ఎంపీడీవో నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ప్రతిరోజు పాల సేకరణ లో పురోగతి సాధించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఇకపై రెండు రోజులకు ఒకసారి ఈ అంశంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. రైతులు ఆలస్యంగా పాలు పోస్తున్నారని దీంతో సేకరణలో కొంత ఇబ్బంది ఏర్పడుతోందని అధికారులు చెప్పడంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సకాలంలో పాల కేంద్రాలకు పాలు పోసే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. రైతుల నమోదు కార్యక్రమం లో తలెత్తిన సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పాల  కేంద్రాలున్న స్థలంలో భూమిని ఎత్తుపల్లాలు లేకుండా చదును చేయాలన్నారు. జిల్లాలో గుర్తించిన 6,800 పాడి పశువులను సంబంధిత రైతులు కొనుగోలు చేసేందుకు ఏపీఎంలు, పశువైద్యాధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డి ఆర్డి ఎ పి డి పిఎస్ఆర్ ప్రసాద్, జిల్లా పశుసంవర్ధక అధికారి శ్రీనివాసరావు, డి సి ఓ ఫణికుమార్, అమూల్ రాష్ట్ర సమన్వయకర్త  ధీరజ్, రాష్ట్ర పాల అభివృద్ధి సంస్థ జిల్లా సమన్వయకర్త ఐ కృష్ణ, ఎంపీడీవోలు, ఏపిఎం లు, సహకార సంఘాల ప్రతినిధులు మెంటార్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *