Breaking News

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

-తొలగింపు ఓటర్ల జాబితా పై ప్రత్యేక దృష్టి
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తుది ఓటరు జాబితా లో 0.1 శాతం మేర జరిగిన తొలగింపుల పై నియోజక వర్గ స్థాయి వారీగా సంబంధింత ఈ ఆర్ వో ద్వారా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత తెలియ చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నియోజక వర్గాల వారీగా తొలగించిన ఓటర్ల జాబితా విషయంలో మరణించిన, షిఫ్టడ్, ఇంతకు ముందు నమోదు చెయ్యడం వలన, ఫారం 8 ద్వారా జరిగిన వాటిపై రిటర్నింగ్ అధికారులను నుంచి సమగ్ర సమాచారం, ధృవీకరించ వలసినదిగా ఆదేశించడం జరిగిందన్నారు.

రాజకీయ పార్టీలు ప్రతినిధులు, ప్రజలు నుంచి ఈనెల 22 న ప్రకటించిన ఓటరు జాబితా లో దొర్లిన తప్పులను సరిదిద్ది ఓటరు జాబితా సరిచేయడం కోసం పారదర్శకంగా, జవాబుదారీ తనం ఉండేలా ఇప్పటికే ఈ ఆర్ వో నుంచి బీ ఎల్ వో వరకు వ్యక్తిగత బాధ్యత వహించాలని పేర్కొన్నట్లు తెలియ జేశారు. రాజకీయా పార్టీలు వ్యక్తం చేసిన అభ్యంతరాల విషయంలో తప్పకుండా నిర్ణీత ఫారం ద్వారా మాత్రమే దరఖాస్తూ చేయాలనీ తెలియ చేశారు. డిసెంబర్ 10 నుంచి ఫిబ్రవరి 6 వరకు మొత్తం 56,231 ఫారం 6 , 7 , 8 రావడం జరిగిందనీ, వాటిలో 28 వేలు పరిష్కారం చెయ్యగా, మిగిలినవి పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.

నియోజక వర్గ స్ధాయిలో బి ఎల్ వో లతో సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చెయ్యడం జరిగిందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. 2023 ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి 6 వ తేదీ వరకు జిల్లాలో మరణించిన 37,888 ఓటర్ల ను జాబితా నుంచి తొలగించడం జరిగిందనీ పేర్కొన్నారు. వీటి విషయంలో పూర్తి ఆధారాలు పరిగణన లోనికి తీసుకుని మాత్రమే తొలగించడం జరిగిందనీ పేర్కొన్నారు. నిర్లక్ష్య వైఖరి ఉండకూడని విధంగా తొలగింపు ఓటర్ల జాబితా ని ఫారం 7 కి అనుగుణంగా మాత్రమే చేపట్టాలని ఆర్ వో లకు స్పష్టం చేశామన్నారు. ఓటరు జాబితా రూపు కల్పన చెయ్యడం జరిగిందన్నారు.  ఇందు కోసం అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం, అందుకు అనుగుణంగా సదరు రాజకీయ పార్టీల సలహాలు సూచనలు పరిగణన లోకి తీసుకుని వెళ్ళడం జరిగిందన్నారు. .

జిల్లాలో పోలింగ్ శాతం పెంచేందుకు స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నా మన్నారు.  ఓటు హక్కు ప్రాముఖ్యత,  వినియోగం పై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు  నిర్వహించామన్నారు. వీటిల్లో కూడా రాజకీయా పార్టీలు భాగస్వామ్యం అయి జిల్లాలో ఓటింగ్ శాతం పెరిగేలా  చూడాలని అన్నారు.

ఈ సమావేశంలో రాజకీయ పార్టిల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇంఛార్జ్ ఎన్. రమేష్( శ్యామ్), బీజేపీ – జిల్లా ప్రధాన కార్యదర్శి బి .రామచంద్రరావు , అప్- జిల్లా కార్యదర్శి ఎన్. సుబ్రహ్మణ్యం, సీపీఐ ఎమ్ – జిల్లా కమిటీ సభ్యుడు ఎస్ ఎస్ మూర్తి,  వైయస్ఆర్ సీపీ పోల్ నిర్వహణ ఇంఛార్జి కే. రాజశేఖర్, టిడిపి జోన్ 2 కార్యదర్శిసి. శ్రీనివాస రావు, , కలెక్టరేట్ ఎన్నికల సెక్షన్ సిబ్బంది గిరీష్ , సునీల్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *