Breaking News

పి పి ఎమ్ ఎస్ పోర్టల్ ఉద్యోగుల డేటా నమోదు తనిఖీ

-ప్రతీ శాఖ తప్పకుండా ఉద్యోగుల సమాచారం, ఓటరు కార్డు వివరాలూ నమోదు చెయ్యాలి
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో  జిల్లాలోని ఎన్నికల్లో విధులను నిర్వర్తించడం కోసం ఇప్పటి వరకూ 5 వేల మంది అధికారుల , సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర డేటా పర్సనల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (PPMS) పోర్టల్ లో నమోదు చేయటం జరిగిందనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన పి పి ఎమ్ ఏస్ డేటా నమోదు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భం గా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేందుకు ప్రతి ఒక్క ఉద్యోగి బాధ్యత అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం సుమారు 15 వేల మంది ఉద్యోగుల సమగ్ర సమాచారం పి పి ఎమ్ ఎస్ పోర్టల్ లో నమోదు చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకూ సుమారు 5 వేల మంది వివరాలు పూర్తి చేసినట్లు తెలిపారు. సుమారు విద్యా శాఖా కు చెందిన 5 వేల మంది ఉపాధ్యాయుల డేటా ఎంట్రీ చెయ్యాల్సి ఉండగా సుమారు రెండు వేల మంది వివరాలూ నమోదు చెయ్యాడం జరిగిందన్నారు. ప్రతిరోజూ నాలుగు మండలాల నుంచి డేటా నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ నమోదు ప్రక్రియ ను డి ఆర్వో జి. నరసింహులు, సిపివో ఎల్ . అప్పలకొండ, డి ఎల్ డివో పి. వీణా దేవి లు పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ శాఖకు సంబంధించిన టైమ్ లైన్ ఇవ్వడం జరిగిందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *