విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటింటికి రాబోయే మన జనసేన టిడిపి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కాలేశ్వరం మార్కెట్ వద్ద గల ఇందాద్ ఘర్ వద్ద ప్రారంభించి శివాలయం వీధి , గోల్డ్ మార్కెట్ ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో గంజాయి అధికంగా ప్రోత్సహిస్తున్నారని యువతకు ఉద్యోగ అవకాశాలు లేక నిరుత్సాహం నిస్పృహలతో తప్పుడు దారులు పడుతున్నారని, దీనికి వైఎస్ఆర్సిపి కారణమని, యువతకు ఉద్యోగాలు రావాలంటే జనసేన టిడిపి ప్రభుత్వం తోనే సాధ్యమని, ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని, , దుకాణ్ మకాన్ పథకాన్ని, కుల చేతివృత్తులకు పనిముట్లు ఇచ్చే ఆదరణ పథకాన్ని ఎందుకు ఎత్తివేసారో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సమాధానం చెప్పాలని, సొంత కాళ్లపై నిలబడే సబ్సిడీ రుణాల్ని ఎందుకు ఎత్తేసారో సమాధానం చెప్పాలని, చిరు వ్యాపారస్తులకి 5000 ఇస్తే ఇస్తే సరిపోతుందా? 5000 కి బండి చక్రం కూడా రాదు బండి కున్న చక్రం కూడా రాదని,
పశ్చిమ నియోజకవర్గం లో ఇల్లు పట్టాలు ఇస్తామని చెప్పి డబ్బులు కట్టించుకుని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రజల్ని మోసం చేసిందని, జనసేన టిడిపి ప్రభుత్వం చేత ఎల్ల పట్టాల రిజిస్ట్రేషన్ తప్పక చేస్తామని, పశ్చిమ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి అవినీతి రాజ్యం వెళుతుందని, రాబోయే రోజుల్లో వారికి తగిన గుణపాఠం చెప్పాలని, జనసేన టిడిపి మద్దతు ఇవ్వాలని అన్నారు
ఈ కార్యక్రమంలో విజయవాడ బుల్లెన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు జవ్వాధి సూర్యనారాయణ, ఉత్తం బండారి, తాట్రాజుల నరేష్, సింగంశెట్టి రాము గుప్తా, తవ్వ మారుతి, పిళ్ళా శంకర్, పిళ్ళా రమణ బాబు, పిళ్ళా సాంబశివరావు, పొట్నూరు శ్రీనివాసరావు బొమ్ము రాంబాబు, తిరపతి అనూష, మొబీనా, రమాదేవి, నజీమా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News