Breaking News

మచిలీపట్నం నుండి అరుణాచల గిరిప్రదక్షిణ కోసం స్పెషల్ బస్సు 

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి నెల పౌర్ణమికి భక్తుల సౌకర్యార్థం అరుణాచల గిరిప్రదక్షిణ కోసం నడుపబడుతున్న మచిలీపట్నం ఆర్టీసీ స్పెషల్ బస్సు ఈ మాసం పౌర్ణమికి ఈ నెల 22 వ తేదీన సాయంత్రం 05.00 గం. లకు మచిలీపట్నం నుండి బయలుదేరి రేపల్లె మీదుగా శ్రీకాళహస్తి, కాణిపాకం, అర్ధవీడు, సిరిపురం, అరుణాచలం వెళ్లి ది.23.2.2024 వ తేదీన పౌర్ణమి రోజు దైవదర్శనం, అరుణాచల గిరి ప్రదక్షణ చేసుకొని అనంతరం కంచి, విష్ణుకంచి, కామాక్షిమ్మగుడి, బంగారుబల్లి, తిరుత్తణి, దర్శించుకొని మచిలీపట్టణం 25వ తేదిన రావడం జరుగుతుంది.ఈ స్పెషల్ బస్సునకు రిజర్వేషన్ సౌకర్యం కలదు. కొద్ది సీట్లు మాత్రమే మిగిలినవని, త్వరపడి రిజర్వేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నామని, ఈ బస్సునకు టికెట్లను ఆన్లైన్ నందుగానీ, ATB ఏజెంట్లు వద్దగాని, రిజర్వేషన్ కౌంటర్ వద్ద గాని పొందవచ్చును. మచిలీపట్నం రిజర్వేషన్ కౌంటర్ no.8247529433 రాను పోను ఒక్కొక్కరికి బస్సు చార్జీ రు .3000/-లు. కావున ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని వినియోగించుకొనమని మచిలీపట్నం, ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ టీ. పెద్దిరాజు ప్రకటనలో కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *