Breaking News

శ్రీ రామరాజ భూషణుడు విగ్రహ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళా క్షేత్రం లో ఆదివారం శ్రీ రామరాజ భూషణుడు విగ్రహ ఆవిష్కరణ కూరపాటి గీతాంజలి దేవి ఛైర్పర్సన్ bhattaraja కార్పొరేషన్ ఆవిష్కరించారు. తదుపరి సభ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. సభకు అధ్యక్షులు గా రసరాజు సినీ గేయ రచయిత వ్యవహరించారు. సభకు ముఖ్య అతిథులు గా శాసనసభ్యులు మల్లాది విష్ణు, వేలంపల్లి శ్రీనివాస్ తోపాటు  గజల్ శ్రీనివాస్, కవి కంట స్పూర్తి , కవి sarikonda నరసింహరాజు పాల్గొన్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ కవి చేగొండి సత్యనారాయణ మూర్తి పాలకొల్లు (సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్  తండ్రి) రామరాజ భూషణుడు గురించి శ్లాఘించారు. భట్టు కుల రత్న స్వర్గీయ బుక్కరాజు ముక్కంటి రాజు స్మారక అవార్డ్ చక్రవరం వెంకట సుబ్బరాజు కి ప్రదానం చేయడం జరిగింది. 5 గురు మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్,పారితోషికం పంపిణీ. 40 మంది పేట  విద్యార్థులు కు పారితోషికం అనంతరం షణ్ముఖ విజయ్ కుమార్ రాజు కృష్ణపాత్ర తో కురుక్షేత్రం పడక శీను ప్రదర్శించుట జరిగింది. ఈ  సభకు శ్రీ రామరాజ భూషణ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కూరపాటి కోటం రాజు tresuror జయప్రకాష్ రాజు, పోరంకి పద్మావతి, కార్పొరేషన్ డైరెక్టర్భట్టు మనోహర్ కుమార్, జనరల్ సెక్రటరీ అనసూయాదేవి, రాజశ్రీదర్, పోరంకి శ్రీనివాసరాజు, చినకోటంరాజు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *