Breaking News

పశ్చిమ లో బీటీ రోడ్ వేయు పనికి ప్రారంభోత్సవము

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి సోమవారం ఉదయం 56వ డివిజన్, ఎర్రగడ్డ రాంప్ డౌన్ నుండి ఓల్డ్ ఆర్ఆర్ పేట రైల్వే గేట్ వరకు బీటీ రోడ్డు వేయు పనికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 31.27 లక్షల రూపాయల మున్సిపల్ సాధారణ నిధులతో బీటీ రోడ్డును ఎర్రగడ్డ రాంప్ కింద నుంచి ఓల్డ్ ఆర్ఆర్ పేట రైల్వే గేట్ వరకు వేస్తున్నారని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జగనన్న ప్రభుత్వం చూసుకుంటుందని, అందుకు నిలువెత్తు నిదర్శనం శంకుస్థాపనలే కాకుండా ప్రారంభోత్సవాలు కూడా జరగడం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ ఆసిఫ్, 56వ డివిజన్ కార్పొరేటర్ యలకల చలపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *