Breaking News

చేతి వృత్తి దారులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తర, తరాలుగా సమాజానికి సేవలందిస్తూ రాష్ట్రంలో 30 రకాల పైగా వున్న చేతి వృత్తి దారులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందించకుండా నిర్లక్ష్యం చేసి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేతి దారులను మళ్ళీ మభ్య పెట్టి మోసగించేందుకు సిద్ధమవుతున్నాయని చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామాంజనేయులు విమర్శించారు. సోమవారం విజయవాడలో దాసరిభవన్ లో సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు సి.లింగమయ్య అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.రామాంజనేయులు మాట్లాడుతూ పది సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో చేతి వృత్తిదారుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టిన 18 రకాల చేతి వృత్తి దారులకు అమలు చేస్తున్న విశ్వకర్మ యోజన పథకం సాధారణ చేతి వృత్తి దారులకు వర్తింప చేయకుండా డబ్బున్న సంపన్నులే చేతి వృత్తులలోకి చొరబడి నిజమైన చేతి వృత్తి దారుల ఉపాధిని దెబ్బతీసే విధంగా సిద్ధమవుతున్నారని,మరోవైపు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల చేతి వృత్తిదారులకు ఒరిగిందేమీ లేదని పైగా కొద్దిమంది చేతి వృత్తి దారులకు జరుగుతున్న లబ్ధి గురిగింజంత చేసి వీరి నుండి ప్రభుత్వం కొండంత దోచుకుంటుందని, అందుకే ఈ మోసపూరిత విధానాల వల్ల ఉపాధి కోల్పోతున్న చేతి దారులు చైతన్యవంతమై తమ మనుగడ కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చర్చించిన అనంతరం 30 రకాల చేతి వృత్తి దారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల జెండాలో చేర్చే విధంగా చేతి వృత్తి దారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి రూపొందించాలని సమావేశం నిర్ణయించింది.ఈ సమావేశంలో ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య,రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు బి.వెంకట్రావు,ఏపీ గొర్రెల,మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పొట్టేలు పెంటయ్య, కోట్ల పోతులయ్య మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నాగాంజనేయులు, సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే. చైతన్య, ఎం.నారాయణ బాబు, చింతల కృష్ణ,డీకే రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *