Breaking News

వైసీపీ ప్రభుత్వంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని దమ్ముగా ధైర్యంగా చెప్పగలం:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగాయని, దళారి వ్యవస్థ ను రూపుమాపి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని దమ్ముగా చెప్పే ధైర్యం మాకుంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం నాడు 10వ డివిజన్ నందు జీవనోపాధి కి ఇబ్బందులు పడుతున్న నాలుగు కుటుంబాలకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు రూ90,000,/- విలువ గల ఒకటి టిఫిన్ బండి,ఒకటి ఇస్త్రీ బండి, రెండు తోపుడు బండ్లు అవినాష్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు పేద ప్రజలకు అండగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. వైసీపీ నాయకులు నిత్యం ప్రజలతో మమేకమై వారి ప్రతి అడుగులో కూడా తోడుగా నిలుస్తూ అండగా ఉంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,10వ డివిజన్ ఇంచార్జ్ కరుటూరి హరీష్ కార్పొరేటర్ చింతల సాంబయ్య,వైసీపీ నాయకులు అచ్చుతరావు,ఉదయ్,సతీష్,జె.పి రెడ్డి,చిన్నూ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *