గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుడ్లవల్లేరు మండలం సంత రోడ్డులో వేంచేసియున్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన 71 వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిసాయి. ముగింపు సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. తొలుత వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు వేద పండితులు, దేవస్థాన కమిటీ పెద్దలు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామివారికి ఎమ్మెల్యే కొడాలి నాని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే నానికి వేద ఆశీర్వచనాలు అందచేయగా, దేవస్థాన ధర్మకర్తల కమిటీ సభ్యులు స్వామి వారి ఫోటో జ్ఞాపికను అందజేసి ఆలయ సంప్రదాయం ప్రకారం దృశ్శాలతో సత్కరించారు. ఈ సందర్భంగా దేవస్థాన అభివృద్ధికి ఎమ్మెల్యే కొడాలి నాని 50వెలు అందచేశారు. అనంతరం దేవస్థాన కమిటీ పెద్దలతో కలిసి ఉత్సవాల ముగింపు అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించి, భక్తులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఆధ్యాత్మిక చింతనలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరు భక్తి భావనను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే కొడాలి నాని సూచించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని, శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు. ముగింపు అన్న సమారాధన కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ గుడివాడ గుప్తా , సభ్యులు కొమ్మనబోయిన రవిశంకర్, గుడ్లవల్లేరు వైస్ ఎంపీపీ సాయన రవి, గుడివాడ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను,వైసిపి నాయకులు పాలేటి చంటి, అడబాల అప్పారావు, మండల యూత్ అధ్యక్షుడు గుదే రవి, సింగంశెట్టి ఆదినారాయణ, కుంచపర్తి సాయి, కొడాలి సుధాకర్, కిషోర్ నాయుడు, వీరబత్తిన రవి, మహారెడ్డి మురళి,సర్పంచ్ కోటప్రోలు నాగు, కోటప్రోలు బాబురావు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News