Breaking News

అభివృద్ధికి మరోసారి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధం

-కండ్రికలో రూ. 40 లక్షలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆశించిన దాని కంటే నియోజకవర్గం మెరుగైన ప్రగతిని సాధించిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కండ్రికలో రూ. 20 లక్షల గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో నిర్మించిన మస్జీద్ కట్ట రోడ్డుతో పాటు మణికంఠ నగర్లో రూ. 20 లక్షల వీఎంసీ సాధారణ నిధులతో నిర్మించిన విఘ్నేష్ టవర్స్ రోడ్డును స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని.. ఆ నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. డివిజన్లో ఇప్పటివరకు రూ. 21.97 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధానంగా రోడ్లపై దృష్టి సారిస్తూ.. రహదారులను ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. 5 వార్డు సచివాలయాల పరిధిలో మంజూరైన కోటి రూపాయల గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో అనేక రహదారులకు మోక్షం లభించిందన్నారు. రూ.19.87 లక్షలతో ప్రజాశక్తి నగర్ కమ్యూనిటీ హాల్ రోడ్డు., రూ.19.97 లక్షలతో కండ్రిక సెంటర్ వద్ద అయాన్ డిజిటల్ రోడ్డు., రూ. 19.98 లక్షలతో లగడపాటి కళ్యాణ మండపం రోడ్డు (బీటీ రోడ్డు) పూర్తి చేసుకున్నట్లు వివరించారు. అలాగే రూ.39.75 లక్షల వీఎంసీ జనరల్ ఫండ్స్ తో జర్నలిస్ట్ కాలనీ అంతర్గత రహదారులు అభివృద్ధి పరిచినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో రోడ్ల మీదనే కండ్రిక గ్రామస్తులంతా కర్మకాండలు చేసుకోవాల్సిన దుస్థితి ఉండేదని మల్లాది విష్ణు గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వంలో రూ. 19.98 లక్షల వ్యయంతో విశాలమైన కర్మల భవనాన్ని నిర్మించుకున్నట్లు తెలియజేశారు. రూ.16.85 లక్షల వ్యయంతో నిర్మించిన శానిటరీ ఇన్స్ పెక్టర్ కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించుకున్నట్లు గుర్తుచేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4 కోట్లతో కండ్రిక జంక్షన్ నుంచి ముస్తాబాద్ జంక్షన్ వరకు 4.2 కి.మీ. మేర చేపట్టిన బీటీ రోడ్డు పనులు తుది దశకు చేరుకున్నట్లు మల్లాది విష్ణు చెప్పారు. పాతపాడు కండ్రిక గ్రామం నుంచి ఎన్.ఎస్.సి.బోస్ నగర్ వరకు రూ.3.40 కోట్ల DMFT ఫండ్ తో చేపట్టిన రహదారి పనులు 50 శాతం పూర్తిచేసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు సెంట్రల్ ప్రాంతంలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తూ.. ఈ ప్రాంతంలో ఒక నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను సైతం ప్రారంభించుకున్నట్లు చెప్పుకొచ్చారు. సంక్షేమాభివృద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరెవరూ సాటిరారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఈ(ఇంజనీరింగ్) మాధవ్, నాయకులు యరగొర్ల శ్రీరాములు, ఎస్.కె.ఇస్మాయిల్, పందిరి వాసు, కొక్కిలిగడ్డ నాని, వెంకటేశ్వరమ్మ, మీసాల రామకృష్ణ, ఎం.రవీంద్రరెడ్డి, దేవిరెడ్డి సంజీవరెడ్డి, మాతా మహేష్, పార్టీ శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *