-67 లక్షల మంది వినియోగం
-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దీక్ష (డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ షేరింగ్) పోర్టల్ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. ఈ పోర్టల్ NCTE, MHRD సంయుక్తంగా జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం రూపొందించిందని తెలిపారు. దీక్ష పోర్టల్ కు అనుసంధానంగా అపెక్స్(APeKX) (ఆంధ్రప్రదేశ్ ఇ నాలెడ్జ్ ఎక్స్చేంజ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల వేదికగా పనిచేస్తుందన్నారు. దీక్ష పోర్టల్లో బోధనాభ్యసన విషయం (Teaching Learning Content ), కంటెంట్ తయారీ సాధనాలు (Content Creation Tool), ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధికి ఆన్లైన్ కోర్స్ (Teacher Professional Development (TPD) Online Courses), ఇంటరాక్టివ్ మూల్యాంకన వేదిక (Interactive Assessment Platform), డాష్ బోర్డ్ సమాచార వినియోగాన్ని పరిశీలించుట. (Dashboard To track usage data), QR కోడ్స్ కలిగిన పాఠ్య పుస్తకాల కంటెంట్ (QR code enabled Energized Textbooks) ఉంటాయని తెలిపారు. పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్స్ రూపకల్పనకు ఆంధ్రప్రదేశ్ తొలి అడుగు వేసిందని, తర్వాత ఎన్సీఈఆర్టీ ఆచరించిందని తెలిపారు. దీక్షా ప్లాట్‌ఫాం ద్వారా ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ శిక్షణను ప్రారంభించిన మొదటి రాష్ట్రం కూడా మనదే అని తెలిపారు.
Prajavartha Online Telugu News