Breaking News

చీపురుపల్లిలో ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్కిల్స్ ల్యాబ్’ ప్రారంభం

-సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలి
-ప్రారంభించిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ఇస్తున్న ఆధునిక సాంకేతిక విద్యని అందిపుచ్చుకోవాలని, 8, 9 తరగతుల విద్యార్థులకు బైజుస్ టాబ్స్ సక్రమంగా వినియోగించుకోవాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్కిల్స్ ల్యాబ్’ ప్రారంభ సభలో విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాలను వివరించారు. అనంతరం తదనంతరం పాఠశాలలో ఇదివరకే ఏర్పాటు చేసిన ఇంటారాక్టివ్ ప్లాట్ ప్యానెళ్లను ఉపాధ్యాయులు వినియోగించే తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్కిల్స్ ల్యాబ్’ ప్రారంభోత్సవంలో సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., తో పాటు విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, ఆసియా పసిఫిక్ అండ్ జపాన్ గవర్నమెంట్ పార్ట్నర్ అండ్ ఇనిషియేటివ్ గ్లోబల్ అఫైర్స్ గ్రూప్ సీనియర్ డైరెక్టర్, Intel శ్వేత కురాణ, డీఈవో బి.ప్రేమ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు MPP ఇప్పిలి వెంకట నరసమ్మ, ZPTC వలిరెడ్డి శిరీష,, చీపురుపల్లి సర్పంచ్ మంగళగిరి సుధారాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఇప్పిలి అనంతరం, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, మంగళగిరి శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా యువజన నాయకులు వంశీకృష్ణ, మీసాల వరహాలునాయుడు మరియు ఎంపీటీసీ సభ్యులు ముళ్ళు రాజ్యలక్ష్మి, కోరుకొండ దాలయ్య, గిరిడే రామదాసు, శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ పిప్పిలి గోవింద్ మరియు పాఠశాల PMC చైర్మన్ కర్ణపు బాలమ్మ మరియు మండల విద్యాశాఖ అధికారి బూసి నాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ప్రధానోపాధ్యాయులుK. చంద్రశేఖర్ కుమార్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *