విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ ఆఫీస్ విజయవాడ వారి రిటైల్ లోన్ పోర్ట్‌ఫోలియోను పెంచే లక్ష్యంతో సోమవారం, బందర్‌రోడ్‌లోని సిరిస్ బ్రాంచ్‌లో ‘మెగా రిటైల్ ఎక్స్‌పో’ రిటైలథాన్ 2024ను నిర్వహించింది. ఎక్స్‌పోను డిజిఎంఎస్ మురళి పార్థసారథి మరియు శారదమూర్తి ప్రారంభించారు. ఎం.శ్రీధర్, రీజనల్ హెడ్ మరియు హరీష్ బేతా మరియు ఐఎస్‌ఎస్ మూర్తి ఇద్దరూ డిప్యూటీ రీజనల్ హెడ్‌లు సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని పలువురు బిల్డర్లు మరియు కార్ డీలర్లు ఈ ఎక్స్‌పోలో పాల్గొని స్టాల్స్‌ను సందర్శించిన పలువురు వినియోగదారులకు తమ పథకాల విశేషాలను వివరించారు. గృహ, వాహన, విద్యా రుణాల మంజూరు లేఖలను వినియోగదారులకు అందజేశారు. అన్ని స్థానిక శాఖల మేనేజర్లు కూడా ఎక్స్‌పోలో పాల్గొన్నారు. వినియోగదారులకు అందుబాటులో ఉన్న వివిధ పథకాలు, సౌకర్యాలపై ప్రదర్శన నిర్వహించారు. ప్రవేశం ఉచితం.
Prajavartha Online Telugu News