Breaking News

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వాకథాన్‌ …

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వాకథాన్‌ నిర్వహించింది. వాకథాన్‌ యొక్క ప్రధాన లక్ష్యం ఈ సంవత్సరం వేడుకల థీమ్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడం, అంటే ‘‘ఇన్‌స్పైర్‌ ఇన్‌క్లూజన్‌’’. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మహిళా ఉద్యోగులను కెరీర్‌ మార్గంలో మరింత గొప్ప బాధ్యతలు చేపట్టేలా ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇంకా యూనియన్‌ బ్యాంక్‌ ముద్ర, స్టాండ్‌ అప్‌ ఇండియా మరియు సిజిటిఎంఎస్‌ఇ వంటి విభిన్న పథకాల కింద రుణాలను అందించడం ద్వారా సమాజంలోని మహిళలను వివిధ వ్యాపార వెంచర్లను చేపట్టేలా ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. బ్యాంక్‌ అత్యుత్తమ స్కీమ్‌ ‘‘యూనియన్‌ నారీ శక్తి’’ని ప్రారంభించింది, ఇందులో మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.2.00 కోట్ల వరకు కొలేటరల్‌ లేని ఉచిత రుణాలు అందించబడతాయి. జోనల్‌ కార్యాలయం మరియు ప్రాంతీయ కార్యాలయం సంయుక్తంగా వాకథాన్‌ నిర్వహించాయి. ఎ కన్వెన్షన్‌ నుండి ప్రారంభమై ఎం.జి.రోడ్‌ వైపు సాగిన కార్యక్రమంలో దాదాపు 200 మంది సిబ్బంది మరియు కస్టమర్లు కూడా పాల్గొన్నారు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో మరియు జీవితంలోని అన్ని రంగాలలో మహిళలను చేర్చడంలో ఈ ఈవెంట్‌ భారీ విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రంలో డిప్యూటీ జోనల్‌ హెడ్డులు, ఎ.శారదమూర్తి మరియు మురళీ పార్ధసారథి మరియు రీజనల్‌ హెడ్‌ ఎం.శ్రీదర్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *