-ఎన్నికల విధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశాం..
-త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న దృష్ట్యా కార్యచరణ సిద్ధం చేసుకొవాలి ..
-జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కలెక్టరేట్ వివిధ విభాగాల అధికారులు, సిబ్బందికి ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలను కేటాయించడం జరిగిందని, వాటిని పూర్తి నిబద్దత కలిగి నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత స్పష్టం చేశారు.
మంగళవారం ఎన్నికల విధులు, బాధ్యతలు పై కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ , జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తో కలిసి కలక్టరేట్ అధికారులు, సిబ్బంది తో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఎన్నికలలో నిర్విహించే విధులను చట్టబద్దత తో కూడి సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి అని పేర్కొన్నారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలను కేటాయించడం జరిగిందన్నారు. మీకు అప్పంగించిన అంశాలకు సంబంధించిన ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, ఉత్తర్వుల మేరకు చేపడుతున్న కార్యకలాపాలు సమర్థవంతంగా చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు ఎలక్షన్స్ సెల్ తో సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలనీ ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి సమన్వయ కర్త గా కీలకమైన బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆరోజు వొచ్చిన టపాల్స్ ఆరోజే పరిష్కారం చెయ్యడం గానీ, జవాబు ఇవ్వడం, వివిధ విభాగాల కు, కార్యాలయాలకు ఎండార్స్ చేయాలన్నారు. రోజూ వారీ కార్యాలయ విధుల్లో నిబద్దత కలిగి ఉండని సందర్భం లో వివరణ కోరడం జరుగుతోందనీ అన్నారు. అయితే ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చేస్తే, పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల విధులను సక్రమంగా చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందజేయ్యాడం జరుగుతుందనీ అన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన తదుపరి ఆయా పనులను ఎటువంటి జాప్యం కు తావులేకుండా చేపట్టడం జరగాలని, అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ , జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, ఏ వో – బివిఏస్. రామారావు, కలక్టరేట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News