Breaking News

జస్టిస్ అరుణ్ మిశ్రాకు స్వాగతం పలికిన కలెక్టర్ ఎస్.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్.హెచ్.ఆర్.సి) చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రాకు మంగళవారం రాత్రి విజయవాడలోని హోటల్ వివంత వద్ద జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు స్వాగతం పలికారు. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ సారథ్యంలోని బృందంలో కమిషన్ సభ్యులు డాక్టర్ డి.ఎం.మూలే, రాజీవ్ జైన్, విజయభారతి సయాని, సెక్రటరీ జనరల్ భరత్ లాల్, రిజిస్ట్రార్ (లా) సురాజిత్ డే, డి ఐ జి పాటిల్ కేతన్ బలిరాం, డిప్యూటీ రిజిస్ట్రార్ (లా), నోడల్ అధికారి ఇంద్రజీత్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈ నెల 6వ తేదీ బుధవారం జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ చైర్ పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బృందం నగరంలోని లబ్బీపేట పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో క్యాంప్ సిట్టింగ్ నిర్వహించనుంది. రాష్ట్రానికి సంబంధించి కేసుల విచారణకు ఈ క్యాంపు సిట్టింగ్ నిర్వహించనుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *