విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవతరం యువత తరచూ మల్టీ టాస్కింగ్ అంటూ ఉంటుంది. మన ఇంట్లో అమ్మ, అక్క, చెల్లినే కాదు.. ఏ మహిళామణిని చూసినా మల్టీ టాస్కింగ్ అంటే ఏమిటో తెలుస్తుంది. ఇంటిని చక్కదిద్దుతూ, బిడ్డల ఆలనాపాలన చూస్తూనే- ఉద్యోగ విధుల్లో, తాము ఎంచుకున్న రంగాల్లో రాణిస్తున్న అతివలు ఎందరో. వారి స్ఫూర్తితో ముందడుగు వేస్తున్న ఈతరం ఆడబిడ్డలు మరెందరో. ప్రతి స్త్రీమూర్తికీ మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఆకాశమే హద్దుగా దూసుకువెళ్లగల సత్తా వీరి సొంతం. వీరికి మనం అందించాల్సింది ప్రోత్సాహం మాత్రమే. విద్య, ఉద్యోగాల్లో రాణించేలా చేయడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించేలా చేస్తాము. నా అక్కలు నా చెల్లెమ్మలు.. అని నాలుక చివరి మాటలతో సరిపుచ్చము. ప్రతి ఆడపడుచుకీ రక్షణ ఇవ్వడం, వారి సంక్షేమానికి కట్టుబడి ఉండటం… రాబోతున్న మా ఉమ్మడి ప్రభుత్వం బాధ్యత అని తెలియచేస్తున్నానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన ద్వారా తెలియచేశారు.
Prajavartha Online Telugu News