Breaking News

అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా విద్యా విధానాలను రూపకల్పన చేయాలి

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు 
-ఐబీ బృందాల పరిశీలనలపై విద్యాశాఖ సమీక్ష
-ముగిసిన ఐబీ బృందం పర్యటన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఐబీ కరికులాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసంధానించడంలో పాటించాల్సిన మెలకువలు, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయడానికి తమ వంతు సహకారం కచ్చితంగా ఉంటుందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు  బి.శ్రీనివాసరావు అన్నారు. ఐబి కరికులం టీం మూడు బృందాలుగా ఏర్పడి పది రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ యాజమాన్య పాఠశాలలను, విద్యా సంస్థలను సందరర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధులతో పాటు, వారితో పాటు పాల్గొన్న విద్యాశాఖ సిబ్బందితో శుక్రవారం ఐబీ ఐబీ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష జరిగింది.
సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు గారు సమీక్ష అనంతరం మాట్లాడుతూ.. మరింత మెరుగైన బోధనా అభ్యసన ప్రక్రియలను, మూల్యాంకన విధానాలను సమీకృతం చేసుకుంటూ మన పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా విద్యా విధానాలను రూపకల్పన చేయనున్నామన్నారు.

ఐబీ బృందాల సూచనలు అనుసరిస్తాం
అనంతరం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఐబీ కరికులం అమలుపరచడంలో రాష్ట్ర పాఠశాల విద్యకు తగిన అర్హతలు, అవకాశాలు కలిగి ఉన్నాయని, వాటితో ఐబీ బృందాల సూచనలు కలుపుకొని మరింత మెరుగైన విద్యా విధానాలను అభివృద్ధి పరుస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ద్విభాష పాఠ్యపుస్తకాలు, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లు, ట్యాబ్స్, స్మార్ట్ టీవీలు వినియోగం, టోఫెల్ శిక్షణ, మన బడి: నాడు – నేడు కార్యక్రమాలు, గోరుముద్ద వంటివి పాఠశాలలో వినియోగించి ఇప్పటికే బోధన జరుగుతోందన్నారు.

ముగిసిన ఐబీ బృందం పర్యటన
రాష్ట్రమంతటా వివిధ పాఠశాలలను పది రోజులపాటు సుదీర్ఘంగా, స్వయంగా పరిశీలించి ఐబీ బృందం తమ పర్యటన శుక్రవారంతో ముగించారు. ఈ సందర్భంగా విజయవాడలో ఐబీ కాన్ఫరెన్స్ హాల్ లో పర్యటనలో భాగంగా తాము పరిశీలించిన పాఠశాలల్లో చక్కటి వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పాఠశాల పరిశుభ్రతపై కేంద్రీకృత పరిశీలన, పాఠశాల పనితీరు సమీక్షలో రోజువారి యాప్స్ వినియోగం, కేంద్రీకృత మానిటరింగ్ సిస్టం, టోఫెల్ శిక్షణ, ఇ-కంటెంట్ అనుసంధానం, అటల్ టింకరింగ్ ల్యాబ్ లు, గ్రంథాలయాల వినియోగం, మెరుగైన అసెస్మెంట్, సమరూప దుస్తులు, ద్విభాషా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, చిక్కీలు, నాణ్యమైన పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం, టాయిలెట్ల మెయింటెనెన్స్ వంటి అమలుతీరు, తదితర అంశాలపై రాష్ట్ర విద్యాశాఖా ఉన్నతాధికారులతో చర్చించారు.
ఈ బృందం లో మెక్సికో కు చెందిన ఆల్డో (కరికులం డిజైన్‌లో సీనియర్ మేనేజర్), ఇంగ్లాండ్ కి చెందిన ఎరిక్ బాబర్(వ్యక్తిగత అభివృద్ధి నిపుణుడు), ఏలెన్ (కరికులం స్పెషలిస్ట్), మైఖేల్ డోనోవన్ (అసెస్‌మెంట్ ఆపరేషన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ అసోసియేట్ మేనేజర్, ఇంగ్లాండ్) భారత్ నుంచి కళా పరశురామ ( సీనియర్ మేనేజర్, ఈక్విటీ మరియు ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్), ఆమెరికా- వాషింగ్టన్ నుంచి వెండీ గ్రీన్ (సీనియర్ మేనేజర్, పోస్ట్ ఆథరైజేషన్ పాలసీ మరియు డిజైన్), జెన్ ప్లేస్జికోచ్ (సీనియర్ లెర్నింగ్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ డెలివరీ) తదితర ప్రతినిధులతో ఎస్సీఈఆర్టీ స్టేట్ అసెస్మెంట్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *