Breaking News

రాయుడు పాకలకు చెందిన బొర్రా శివకు సీ ఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం

-మంత్రి వేణుగోపాల కృష్ణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఔదర్యం లో సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పిస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమ సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫి శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోర్డినేటర్ చెల్లు బోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ అన్నారు. శనివారం స్థానిక మంత్రి వేణుగోపాల కృష్ణ క్యాంపు కార్యక్రమంలో కోలమూరు గ్రామ పంచాయతీ రాయుడుపాకల గ్రామానికి చెందిన బొర్రా శివకు రూ.2 లక్షల 30 వేల రూపాయల చెక్కును మంత్రి అందచేశారు. ఈ సందర్బంగా మంత్రి వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ, రాయుడుపాకల గ్రామానికి కి చెందిన శివ న్యూరాలజి సంబంధిత వ్యాధితో బాధపడుతున్నందున చందన నాగేశ్వర్ ద్వారా ముఖ్యమంత్రికి అర్జీ ఇవ్వడం జరిగిందన్నారు. పేదల ఇంటికి పెద్ద అన్నగా ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించే జగనన్న శివ వైద్య ఖర్చుల నిమిత్తం రు. 2 లక్షల 30 వేల రూపాయల మొత్తాన్ని సిఎం సహాయ నిధి నుంచి విడుదల చెయ్యడం జరిగిందన్నారు. నేడు బాధిత కుటుంబ సభ్యులకు ఆ మేరకు చెక్కు అందించి శివ ఆరోగ్య భద్రతకు ఆర్ధిక భరోసాగా కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శివ తో పాటు శివ కుటుంబ సభ్యులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *