Breaking News

జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ రూములు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే ఎన్నికల్లో ఈవీఎంల భద్రత ఎంతో ముఖ్యమని, అందుకు తగిన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు భద్రపరిచేందుకు గుర్తించిన స్ట్రాంగ్ రూములు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించారు.

పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి గంగూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో, గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి గన్నవరంలో జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్, అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పామర్రు, గుడివాడ, పెడన, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లోని మార్కెట్ యార్డులలో గుర్తించిన స్ట్రాంగ్ రూములు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు పరిశీలించారు.

గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, పెనమలూరు నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ఆర్డీవో డి. రాజు, గుడివాడ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ఆర్డీవో పద్మావతి, మచిలీపట్నం నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ఆర్డీవో ఎం వాణి, పెడన నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ముడ విసి పి. వెంకటరమణ, పామర్రు రిటర్నింగ్ అధికారిగా కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, అవనిగడ్డ రిటర్నింగ్ అధికారిగా గుడివాడ మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం వారి వారి నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలు భద్రపరిచేందుకు గుర్తించిన స్ట్రాంగ్ రూములు, పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ప్రణాళిక జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్కు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్నికలు షెడ్యూలు ప్రకటించగానే జిల్లా గోడౌన్ నుండి మొదటి స్థాయి ర్యాండమైజేషన్ ద్వారా ఈవీఎంలు వివిధ నియోజకవర్గాలకు పంపడం జరుగుతుందని, వాటిని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచేందుకు తీసుకుంటున్న భద్రత చర్యలు పరిశీలించినట్లు తెలిపారు. పోలింగ్కు ముందు సెకండ్ లెవెల్ రాండమైజేషన్ నిర్వహించి ఆయా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు కేటాయించడం జరుగుతుందని, అదేవిధంగా పోలింగ్ పూర్తయిన తర్వాత వాటిని మరల స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచడం జరుగుతుందని, అనంతరం కౌంటింగ్ కోసం మచిలీపట్నంలోని కృష్ణ విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రానికి తరలించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ఎంతో సున్నితమైనది, ఈవీఎంల భద్రత ఎంతో ముఖ్యమైనది కావున స్ట్రాంగ్ రూములు , జిల్లా ఎస్పీ తో కలిసి స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. అదేవిధంగా పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ అనంతరం పోలింగ్ మెటీరియల్ రిసీవ్ చేసుకొనుటకు రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా కేంద్రాల వద్ద జంగిల్ క్లియరెన్స్ చేయాలని ఆర్వోలకు సూచించినట్లు తెలిపారు.

జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ ఈవీఎంలు భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు, నిషేధిత ప్రాంతంగా అవసరమైన సెక్యూరిటీ సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. సెక్యూరిటీ చర్యల్లో భాగంగా స్ట్రాంగ్ రూములు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల వద్ద అన్ని వైపులా మూమెంట్ పరిశీలించి అవసరమైన పటిష్టమైన బ్యారీకేడింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏ ఎస్ పి ఎస్ వి డి ప్రసాద్, డీఎస్పీలు, ఆయా మండల తాసిల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *