Breaking News

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ని మర్యాద పూర్వకంగా కలిసి న డాక్టర్ తరుణ్ కాకాని  ….

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ని మర్యాద పూర్వకంగా బిజెపి నాయకులు, ABC వ్యవస్థాపకుడు డాక్టర్ తరుణ్ కాకాని సోమవారం కలిసారు. ఈ సందర్భంగా తరుణ్‌ కాకాని మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలకు, పనితనానికి ఆకర్షితుడినై బీజేపీలో చేరానని, ఆదర్శ రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తూ కాకాని వెంకటరత్నం వారసుడిగా కాకుండా వెంకటరత్నం రాజకీయ ఆశయాలకు వారసుడిగా మాత్రమే రాజకీయాలలో వచ్చానని తెలిపారు. పార్టీ బలోతపేతంతోపాటు, రానున్న ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీలో నేటి తరానికి, యువ నాయకులకు ఎప్పుడు గుర్తింపు వుంటుందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి, సంక్షేమం ఏక కాలంలో నడిపిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *