Breaking News

పోలింగ్ రోజున విధులు నిర్వహించే పీవో ఎపివో ఉద్యోగులకు ఏప్రియల్ 15 న తోలి శిక్షణ కార్యక్రమం

-ఏడు నియోజక వర్గాల శిక్షణ కేంద్రాలు గుర్తింపు
-అదే రోజున పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం 12 అందచెయ్యలి, నియామక ఉత్తర్వు, ఎపిక్ ఓటరు కార్డు తీసుకుని రావాలి
-ఓ పీ ఓ, మైక్రో అబ్జర్వర్స్ సంభందిత నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఏప్రిల్ 22 లోగా ఫారం 12 అందచేయాలి
-పోలింగ్ సిబ్బందికి నియామక ఉత్తర్వులు జారీ
-ఎన్నికల విధులకు హాజరుకాకపోతే తీవ్రంగా పరిగణిస్తాం…
-కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధుల్లో బాధ్యతలు చేపట్టే ప్రిసైడింగ్ అధికారులు, సహయ ప్రిసైడింగ్ అధికారుల తొలి యాదృచ్ఛికీకరణ (రాండమనైజేషన్) ప్రక్రియ పూర్తి చేసి నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత తెలియ చేశారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ తో కలిసి రాండమానైజేషన్ పూర్తి చేసి, అనంతరము నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, మే 13 న సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారుల, సహయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర అనుబంధ సిబ్బందిని పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. అందులో భాగంగా ఏప్రియల్ 15 వ తేదీన ఆయా నియోజక వర్గాల స్ధాయిలో ఎన్నికల విధుల్లో బాధ్యతలు నిర్వహించే ఉద్యోగులను తొలి శిక్షణా తరగతులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. శిక్షణ కార్యక్రమం హాజరయ్యే సిబ్బందిని రాండమానైజేషన్ ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. పి వో, ఏ పి వో, ఓ పి ఓ, మైక్రో అబ్జర్వర్స్ లకు పోస్టల్ బ్యాలెట్ కోసం నియమాక ఉత్తర్వు లతో పాటు ఫారం 12 జత చేసి పంపడం జరుగుతోందనీ అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కోసం ఎపిక్ కార్డు వివరాలు, నియామక ఉత్తర్వులు కాపీ, ఫారం 12 పై సంతకాలు చేసి అంద చేయ్యల్సి ఉంటుందనీ తెలిపారు. పీ వో లు ఏ పి వో లు శిక్షణ కార్యక్రమం సందర్భంలో ఏప్రియల్ 15 శిక్షణ ఇచ్చే ప్రదేశంలో రిటర్నింగ్ అధికారికి ఫారం 12 అనుబంధ పత్రాలు అందచెయ్యలన్నారు. అదే విధంగా ఒ పి ఓ లు, మైక్రో అబ్జర్వర్స్ లు వారికీ ఓటు హక్కు కలిగి ఉన్న నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి కి ఫారం 12 , ఇతర నిర్దేశిత పత్రాలు ఏప్రియల్ 22 లోగా అందచేయాలని కలెక్టర్ తెలియ చేశారు.

నియామక ఉత్తర్వులకు అనుగుణంగా ఎన్నికల విధులకు హాజరుకాకపోతే తీవ్రంగా పరిగణించ బడుతుందనీ మాధవీలత స్పష్టం చేశారు. ఎన్నికల ఉత్తర్వుల ను ఉల్లంఘించిన అసమ్మతి అధికారులు , సిబ్బంది పై క్రమశిక్షణా చర్యలకు బాధ్యత వహించాలని , ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం శిక్షార్హులు అని జిల్లా ఎన్నికల అధికారి తెలియ చేశారు. రిటర్నింగ్ అధికారులు ఈమేరకు ఉద్యోగులను అవగాహన కలిగించాలనీ ఆదేశించారు.

రెండవ శిక్షణ కార్యక్రమం కోసం రెండవ రాండమానైజేషన్ ద్వారా కేటాయించినా నియోజక వర్గం లో నిర్వహించే రెండవ శిక్షణ కార్యక్రమం కు హజరు కావలసి ఉంటుందనీ కలెక్టర్ తెలిపారు.

సంభందిత నియోజక వర్గం లో పోలింగ్ జరిగే వారం రోజుల ముందు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కలించనున్నట్లు తెలిపారు. ఫెసిలిటేషన్ సెంటర్ నందు పోస్టల్ బ్యాలెట్ జారీ చేసి, అక్కడే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

పోలింగు రోజున విధుల్లో ఉండే పి వో, ఏపీవో  శిక్షణ కార్యక్రమం నిర్వహించడం, అదే సమయంలో ఫారం 12, ఎపిక్ కార్డు కాపీ , నియామక ఉత్తర్వులు కాపీ అనుసరించి పోస్టల్ బ్యాలెట్ జారీ చేసి, ఫెసిలిటేషన్ సెంటర్ నందు జారీ చేసి, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

పీ వో, ఏ పీవో ల నియోజక వర్గాల వారీగా శిక్షణ కార్యక్రమం నిర్వహించే కళాశాలలు / స్కూల్స్ :

** రాజమండ్రి (అర్బన్) – ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ..

** రాజమండ్రి (రూరల్) ఫ్యూచర్ కిడ్స్ స్కూల్, కవలగొయ్యి,(హెమ్లెట్ ) పిడింగొయ్యి పంచాయతీ

** అనపర్తి – ఏస్ ఆర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, మార్కండేయపురం –

** రాజానగరం – బి వీ సి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ –

** కొవ్వూరు – దీప్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ..

** నిడదవోలు – వికాస్ డిగ్రీ కళాశాల ..

** గోపాలపురం – .డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకులం బాలికల రెసిడెన్షియల్ స్కూల్ …

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జీ. నరసింహులు, ఇతర ఎన్నికల అధికారులూ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *