Breaking News

నేడు సాధించిన విజయాలు మనందరి ఉమ్మడి కృషి

-జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకొని వెళ్ళడం లో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
-కలెక్టర్ మాధవీలత
-ఎన్నికల విధులను జవాబుదారీతనం కలిగి ఉండేలా బాధ్యతలను నిర్వహించాలి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
నూతన జిల్లా ఏర్పడి రెండేళ్లు పూర్తీ చేసుకున్నామని, జిల్లాలో ప్రగతి పథంలో ముందుకు తీసుకొని వెళ్ళడం లో అధికారుల, సిబ్బంది తోడ్పాటు అభినందనీయం అని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.

గురువారం ఉదయం కలెక్టరేట్ లో మూడో ఏడాది లో అడుగు పెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించినా కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, గత రెండేళ్లుగా తనతో పాటు కలసి పనిచేసిన అధికారులూ సిబ్బంది తోడ్పాటు, సమన్వయం సాధించడం ద్వారా జిల్లాకి మంచి గుర్తింపుని తీసుకుని రావడం జరిగిందన్నారు. ప్రభుత్వ కార్యక్రమం కానీ, మనం మన జిల్లాలో చేపట్టిన పనులు గానీ విజయవంతం అవడం నిదర్శనంగా అన్నారు. సమన్వయం చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించడం సాధ్యం అవుతుందని , అందులో మీ సహకారం, పాత్ర కీలకం అని పేర్కొన్నారు. కొత్తగా జిల్లా ఏర్పడినప్పుడు మౌలిక సదుపాయాలు, మానవ వనరుల తదితర సమస్యలు ఉన్నా, దశల వారీగా వాటినీ అధిగమిస్తూ చక్కటి ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ లో కూడా సమన్వయం సాధించడం అత్యంత కీలకం అన్నారు.

పారదర్శకంగా , జవాబుదారీతనం కలిగి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరూ ఇదే విధమైన స్పూర్తితో పని చెయ్యాలని కలెక్టర్ మాధవీలత విజ్ఞప్తి చేశారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, చక్కని మార్గదర్శకం ఉంటే జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకొని వెళ్ళడం సాధ్యం అవుతుందని అనడానికి కలెక్టర్ మాధవీలత ఆద్వర్యంలో సాధిస్తున్న పనీ తీరే నిదర్శనం అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు,  జిల్లాలో బంగారు కొండ అనే కార్యక్రమం వినూత్న ఆలోచనలకు సృజనాత్మకత జోడించి విజయవంతంగా చేపట్టి ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. గత నాలుగు సీజన్లలో ధాన్యం కొనుగోలు చేసి, రైతులకి భరోసా కల్పించడం , రీ సర్వే, నేడు ఎన్నికల విధులు నిర్వహించే క్రమంలో చక్కటి మార్గదర్శకం ఇవ్వడం  జరిగిందన్నారు.

జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, ఇతర జిల్లా అధికారులూ,  కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *