Breaking News

వడగాల్పులకు ప్రజలు వీలైనంతవరకు అప్రమత్తంగా ఉండాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఐఎండి సూచనల ప్రకారం ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈసారి ఎక్కువ రోజుల పాటు వడగాల్పులు వీయవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. ఈ సీజన్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు 109 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 115 మండలాల్లో తీవ్ర, 245 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (109) :-
శ్రీకాకుళం24 , విజయనగరం25, పార్వతీపురంమన్యం14, అల్లూరి సీతారామరాజు6, విశాఖపట్నం3, అనకాపల్లి16, కాకినాడ11, కోనసీమ1, తూర్పుగోదావరి9

గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 44.1°C, వైయస్సార్ జిల్లా చిన్నచెప్పల్లిలో 43.9°C, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.8°C, ప్రకాశం జిల్లా దరిమడుగు 43.6°C, అనంతపురం జిల్లా తెరన్నపల్లి 43.5°C, నెల్లూరు జిల్లా మనుబోలు, తిరుపతి జిల్లా చియ్యవరంలో 43.2°C, శ్రీసత్యసాయి జిల్లా కుటగుల్లలో 43.1°C అధిక ఉష్ణోగ్రతలు, 18 జిల్లాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 21 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 97 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.

ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *