విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అడిషనల్ కమిషనర్ (జనరల్) మహేష్, అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, కార్పొరేషన్ సిబ్బంది సమక్షంలో బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఆయన పాత్ర ఎనలేనిదని . దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ ముందున్నారని . సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారని, ఆయన నడిచిన బాట.. అనుసరించిన ఆదర్శాలు.. చూపిన సంస్కరణ మార్గాలనూ గుర్తుచేసుకుంటూ.. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ వేడుకలలో అడిషనల్ కమిషనర్ (జనరల్) మహేష్ అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) కె.వి సత్యవతి, తో పాటు మేనేజర్ బి శ్రీనివాస్, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News