Breaking News

కలెక్టరేట్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, డీఆర్వో వి.శ్రీనివాసరావు తదితరులతో కలిసి బాబూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. బాబూజీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకొని యువత ముందుకు సాగాలని.. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *