విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత వేసవి సీజన్ లో త్రాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకున్నామని ఎన్ టి ఆర్ జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ డి. వెంకట రమణ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ ఆర్ డబ్ల్యూ ఎస్ పర్యవేక్షక ఇంజినీర్ వారి కార్యాలయంలో త్రాగునీటిపై ” కంట్రోల్ రూమ్ ” ఏర్పాటు చేశామని అయన తెలిపారు. జిల్లా పరిధిలో త్రాగు నీటి సమస్యలపై ప్రజలు ఈ కంట్రోల్ రూమ్ నకు ఫిర్యాదు చేసిన వెంటనే తగు చర్యలు చేపట్టి త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రతీ రోజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని పర్యవేక్షక ఇంజినీర్ మరియు సిబ్బంది అందుబాటులో ఉంటారని, త్రాగునీటి సమస్యలపై ప్రజలు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ నేరుగానే టెలిఫోన్ ద్వారా తమ ఫిర్యాదులు చేయవచ్చునన్నారు. ఎటువంటి త్రాగునీటి సమస్యలు ఉన్నా ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఇ డి. వెంకట రమణ – 9100121300, సిబ్బంది జి. పద్మజ – 9100121306, ఎల్ పి ఎస్ ఆర్. కృష్ణ – 6304990363, ఎం. బాలచంద్ర – 9989206318 నెంబర్లకు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చునన్నారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News