-ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఉండదు
-ఎన్నికల పోలింగ్ విధులకు హాజరయ్యే అధికారుల సంక్షేమం కొరకు జిల్లా అధికారి నియామకం
-ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సంబంధిత మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లు బిఎల్వోలు వారి గ్రామ వార్డు పరిధిలో పర్యటించి ఎంసిసి ఉల్లంఘనలు లేవని ధృవీకరించాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రతి ఉద్యోగి తప్పక నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఉండదని, అలాగే ఎన్నికల పోలింగ్ విధులకు హాజరయ్యే అధికారుల సంక్షేమం కొరకు జిల్లా అధికారి నియమించామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఎన్నికల విధులు కేటాయించబడిన జిల్లా నోడల్ అధికారులతో వారి విధుల కార్యాచరణపై కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ప్రతి నోడల్ అధికారి వారి విధులకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి టైం లైన్ ప్రకారం కార్యాచరణ ప్రణాళికలతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని అప్పుడే ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించగలమని సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు.
పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రతి ఉద్యోగి తప్పక విధులకు హాజరు కావాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఉండదని, అలాగే ఎన్నికల పోలింగ్ విధులకు హాజరయ్యే అధికారుల సంక్షేమం కొరకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని నియమించామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధులకు హాజరయ్యే వారి సంక్షేమం జిల్లా ఎన్నికల అధికారిగా తన బాధ్యత అని, పోలింగ్ విధులకు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తప్పక విధులకు హాజరు కావాలని, ఎలాంటి మినహాయింపు ఉండదని, లేనిచో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సంబంధిత మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లు, బిఎల్వోలు వారి గ్రామ వార్డు పరిధిలో పర్యటించి ఎంసిసి ఉల్లంఘనలు లేవని ధృవీకరించాలని, బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎప్పటికప్పుడు అమలు, వాటి పర్యవేక్షణ ఉండాలని, ప్రత్యేక డ్రైవ్ చేసి గ్రామ వార్డు పరిధిలో పోస్టర్లు, స్టిక్కర్లు, హోర్డింగులు ఇంకా ఏమైనా ఉంటే వాటిని గుర్తించి తొలగించాలని ఆదేశించారు. ఎంపిడిఓ లు, మునిసిపల్ కమిషనర్ లు పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల విధులు కేటాయించబడిన సిబ్బంది వారి ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలి సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎన్నికల జిల్లా నోడల్ అధికారులు, ఎలక్షన్ సెల్ సిబ్బంది, తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News