-విధులకు హాజరు కాని ఎన్నికల సిబ్బంది పై కఠిన చర్యలు
-సోమవారం ఉదయం నిర్వహించే శిక్షణ కార్యక్రమం లో 12 డి ఫారాలు స్వీకరణ
-పోస్టల్ బ్యాలెట్ స్వీకరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
-వెంట తీసుకుని రావాల్సిన పత్రాలు ఎన్నికల ఉత్తర్వుల, ఎపిక్ కార్డు, ఆధారా కాపీ ఫారం 12డి
-ఉదయం 9 గంటల నుంచి సా 5 వరకు శిక్షణా తరగతులు
-జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఎన్నికల అధికారి ద్వారా ఎన్నికల విధులకు నియమించిన ఉద్యోగులు విధులకు గైరాజరైతే 1951 ఆర్ పి యాక్ట్ సెక్షన్ 28 ఏ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత హెచ్చరించారు. ఆదివారం స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయ సమావేశ మందిరం నుంచి నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులు, ఇతర అనుబంధ అధికారులతో పీ వో, ఏ పి వో శిక్షణ కార్యక్రమం ముందస్తు ఏర్పాట్లు , చేపట్టవలసిన , దిశా నిర్దేశనం చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఏడు నియోజక వర్గ పరిధిలో ఏప్రియల్ 15 సోమవారం ఉదయం 9 గంటలకి శిక్షణ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రిసైడింగ్ అధికారుల, సహయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమం కోసం పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చెయ్యడం , వేదికలు నిర్ణయించడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ప్రభుత్వ ఉద్యోగులకి ఎన్నికల విధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల విధుల్లో అవిధేయత లేదా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలను తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల శిక్షణా కార్యక్రమం కోసం హజరవుతున్న పి వో, ఏపివో లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు, శిక్షణకు సంబంధించిన శిక్షణా తరగతులు నిర్వహణా, ఇతర మౌలిక సదుపాయాలు అత్యంత ప్రాధాన్యతా ఇవ్వాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనడం దేశ సేవకిందకి వస్తుందని, ఇటువంటి పవిత్ర కార్యక్రమములో నిబద్దత కలిగి విధులను నిర్వర్తించడం చాలా ముఖ్యం అన్నారు. జిల్లా లో రానున్న సార్వత్రిక ఎన్నికల ను విజయవంతం చేయడం లో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో,సమన్వయంతో పనీ చేయాలనీ కోరారు. ఎన్నికల విధులకు సంబందించి ఎటువంటి మినహాయింపులు ఇవ్వటం జరగలేదని, విధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆయా నియోజక వర్గాల లో సోమవారం జరిగే శిక్షణ తరగతులు ఖచ్చితంగా హజరు కావాలని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు ఇప్పటికే ఉద్యోగుల సెల్ ఫోన్లు కి మెసేజీ పంపడం, సంభందిత డ్రాయింగ్ అధికారి ద్వారా నియామక ఉత్తర్వులు జారీ చేయటం జరిగిందనీ తెలియ చేశారు.
నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టీ శిక్షణ కోసం వొచ్చే వారికీ త్రాగునీరు వసతి, ఇతర సదుపాయాల కల్పించాలని కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. శిక్షణా తరగతి గదుల్లో స్క్రీన్స్, మైక్స్ , స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ ఫారాలు పై శిక్షణా , ట్రైనింగ్ ఈవిఎమ్ యూనిట్స్, ఎన్నికల కమీషన్ ద్వారా జారీ చేసిన పీ వో, ఏ పి వో ల శిక్షణ కు చెందిన వీడియో ల ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. పొలింగ్ రోజున, పోలింగు ముందు రోజున చెయ్యవలసిన విధులు , బాధ్యతలు పై ఏ ఎమ్ ఎల్ టి (అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్) ల సమగ్ర సమాచారాన్ని అందచేయ్యాలన్నారు. ఈ వి ఎమ్ ల తొలి రాండమైజెషన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించినట్లు, అమేరకు విధులు నిర్వర్తించిన ప్రతీ ఒక్కరూ అభినందనీయులు అన్నారు. అదే విధంగా శిక్షణ తరగతులు, రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ను కూడా విజయవంతం చెయ్యాల్సిన బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
నియోజక వర్గాల వారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న వేదికలు :
రాజానగరం – బీ వి సి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
కొవ్వూరు – దీప్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్
గోపాలపురం – డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకులం బాలికల రెసిడెన్షియల్ స్కూల్
రాజమండ్రి(రూరల్)ఫ్యూచర్ కిడ్స్ స్కూల్, కవలగొయ్యి, H/o పిడింగొయ్యి పంచాయతీ
రాజమండ్రి (అర్బన్) – ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల
అనపర్తి – ఎస్ ఆర్ జెడ్ పి బాలుర ఉన్నత పాఠశాల,
నిడదవోలు – మార్కండేయపురం వికాస్ డిగ్రీ కళాశాల
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, డి ఆర్వో జీ. నరసింహులు పాల్గొనగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇతర రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News