అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ – 2023(UPSC Results 2023) తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు, అనిమేష్ ప్రధాన్‌కు రెండో ర్యాంకు రాగా, తెలుగమ్మాయి అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకుతో మెరిశారు. 2023 ఏడాదికి గాను 1016 మందిని యూపీఎస్సీ(UPSC) ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీ 165 , ఎస్టీ విభాగం నుంచి 86 మంది చొప్పున ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది ఎంపిక కాగా ఐఎఫ్‌ఎస్‌కు 37, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ – ఎ కేటగిరీలో 613 మంది, గ్రూప్ బి సర్వీసెస్‌లో 113 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది.
Tags AMARAVARTHI
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News