-త్రాగునీటి సరఫరాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలి
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి వెలగపూడి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ లతో త్రాగునీరు సరఫరా, ఉపాధి హామీ పనులు , విద్యుత్ సరఫరా అంశాల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత జిల్లా ప్రగతి పై సమీక్ష నిర్వహించి అధికారులకి దిశా నిర్దేశనం చేశారు. వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తు చర్యలు, సంభందిత శాఖలతో సమన్వయం చేసుకోవడం జరిగిందనీ అన్నారు . విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఫీడర్ లైన్, ట్రాన్సఫర్మ లు నిర్వహణా కోసం ప్రత్యేక కార్యచరణ సిద్దం చేసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందనీ రాష్ట్ర విపత్తుల నివారణ సంస్ధ హెచ్చరికలు జారీ నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, త్రాగునీటి సరఫరాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసు కోవడం పై క్షేత్ర స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరా లో , అధిక ఉష్ణోగ్రతలు నేపధ్యంలో విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఆటంకాలు లేకుండా తగిన ముందుస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఎస్ ఈ ఏపిడీసిఎల్ మూర్తి , ఆర్ డబ్ల్యూ ఎస్ ఏస్ ఈ – డి. బాలశంకర్ రావు, డ్వామా పీడీ ఏ. ముఖలింగం , ఇరిగేషన్ డి ఈ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News