-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికల విధులలో భాగమైన ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ సమర్పణ తేదీ ఏప్రిల్ 24వ తేదీ వరకు గడువు పెంపు చేయడమైనది అని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తిరుపతి జిల్లాలో పనిచేస్తూ సాధారణ ఎన్నికలలో భాగమైన ఉద్యోగస్తులు ఈ నెల ఏప్రిల్ 24వ తారీఖు వరకు ఫారం-12 నందు పోస్టల్ బ్యాలెట్ సమర్పణకు గడువు పెంపు చేయడమైనదని, సదరు ప్రతిపాదనలు సంబంధిత తహశీల్దార్ కార్యాలయములో సమర్పించుటకు అవకాశము ఉన్నదని, ఈ అవకాశమును అందరు ఉద్యోగస్తులు సద్వినియోగం చేసుకుని, తాము విధులు నిర్వర్తిస్తున్న మండల తహశీల్దార్ కార్యాలయము నందు ఫారం-12 ప్రతిపాదనలు అందజేయగలరని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News